అత్యంత పవిత్రమైన శ్రావణమాసంలో వచ్చే తొలి పండుగ నాగపంచమి.ఈ నాగపంచమిని ప్రతి ఏడాది శ్రావణ మాసంలో శుక్లపక్షం రోజున నాగపంచమి జరుపుకుంటారు.
ఈ క్రమంలోనే ఈ ఏడాది నాగపంచమి ఆగస్టు 13వ తేదీన వచ్చింది.ఈ క్రమంలోనే నాగ పంచమి వేడుకలను దేశ వ్యాప్తంగా భక్తులు పెద్ద ఎత్తున నాగ దేవతకు పూజలు చేస్తారు.
తమ చేస్తున్న పాపాల నుంచి విముక్తి పొందడం కోసం నాగ పంచమి రోజు నాగదేవతను పూజించడం ఆనవాయితీగా వస్తుంది.పవిత్రమైన నాగ పంచమి రోజు ఏం చేయాలి ఏం చేయకూడదు అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
నాగ పంచమి రోజు భక్తులు పెద్ద ఎత్తున ఉపవాసం ఉండి పూజలు చేస్తారు.ఎందుకనగా ఉపవాసం అనేది పాముకాటు నుంచి ప్రజలను రక్షిస్తుంది.అదే విధంగా నాగపంచమి రోజు పెద్ద ఎత్తున పుట్టలో పాలు పోస్తారు.ఈ విధంగా పుట్టలో పాలు పోయడం వల్ల లోపల ఉన్నటువంటి పాములు ఎన్నో ఇబ్బందులు పడతాయి కనుక పాలు పుట్టలోకి బదులుగా నాగ దేవతల విగ్రహాలకు పాలు పోయడం ఎంతో ఉత్తమం.
ఎంతో పవిత్రమైన ఈ శ్రావణ మాసంలో వస్తున్నటువంటి నాగ పంచమి రోజు ఆ పరమ శివుడికి రుద్రాభిషేకం చేయడం వల్ల మనం కోరుకున్న కోరికలు నెరవేరుతాయి.అలాగే నాగ పంచమి రోజు మహా మృత్యుంజయ మంత్రాన్ని పఠించాలి.