ఆరోగ్యమైన సంతోషకరమైన జీవితాన్ని గడపాలంటే పోషకాహారం తీసుకోవడం, శారీరక శ్రమ ఎంత అవసరమో కంటి నిండా నిద్ర కూడా అంతే అవసరం.రోజుకు ఏడు నుంచి ఎనిమిది గంటలు నిద్రపోవడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండవచ్చు.
అయితే నిద్రించే సమయంలో మనలో చాలా మందికి తలకింద ఎత్తైన దిండు( High Pillow ) పెట్టుకునే అలవాటు ఉంటుంది.దిండు ఎత్తు లేకపోతే కొందరికి నిద్ర కూడా పట్టదు.
మీరు కూడా ఎత్తైన దిండు వాడుతున్నారా.? అయితే ఏరికోరి సమస్యలు తెచ్చుకున్నట్లే.అవును నిద్రించే సమయంలో తలకింద ఎత్తైన దిండు పెట్టుకోవడం వల్ల అనేక సమస్యలు తలెత్తుతాయని నిపుణులు చెబుతున్నారు.
ఎత్తు దిండు ఉపయోగించడం వల్ల కలిగే అత్యంత ప్రముఖమైన దుష్ప్రభావాల్లో ఎగువ శరీరం యొక్క పేలవమైన భంగిమ ఒకటి.
దిండు ఎత్తుగా ఉన్నప్పుడు.అది మీ తల మరియు మెడను అధికంగా పైకి లేపుతుంది.
దీంతో మెడ మరియు ఎగువ వీపు కండరాలపై ఒత్తిడి పెరుగుతుంది.కాలక్రమేణా దీర్ఘకాలిక మెడ నొప్పికి( Neck Pain ) దారితీస్తుంది.
వెన్నెముక సమస్యలు తలెత్తుతాయి.

అలాగే ఎత్తు దిండును ఉపయోగించడం మీకు సౌకర్యంగా ఉండవచ్చు.కానీ దాని కారణంగా గుండెల్లో మంట ఏర్పడుతుంది.ఎందుకంటే తల కింద ఎత్తైన దిండు పెట్టుకున్నప్పుడు కడుపులోని ఆమ్లం( Stomach Acid ) అన్నవాహికలోకి తిరిగి వెళ్తుంది.
ఇది అసౌకర్యం మరియు మండే అనుభూతులను కలిగిస్తుంది.తల కింద ఎత్తైన దిండు పెట్టుకుని పడుకోవడం వల్ల శ్వాస సమస్యలను( Breathing Problems ) తలెత్తుతాయి.గురక, శ్వాస ఆడకపోవడం వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.

అంతేకాదు ఎత్తు దిండును ఉపయోగించడం వల్ల వచ్చే మరో సాధారణ దుష్ప్రభావం తలనొప్పి.నిద్రపోతున్నప్పుడు తలను తప్పుడు అమరికలో పెట్టడం వల్ల మెడ కండరాలు మరియు రక్తనాళాలపై అధిక ఒత్తిడి పడుతుంది.ఇది తలనొప్పికి( Headache ) కారణం అవుతుంది.
మైగ్రేన్‌ల ప్రమాదాన్ని కూడా పెంచుతుంది.ఇక ఎత్తు దిండు వాడటం వల్ల చర్మంపై ముడతలు సైతం త్వరగా వస్తాయని నిపుణులు చెబుతున్నారు.
కాబట్టి ఇకపై ఎత్తు దిండు కాకుండా ఫ్లాట్ గా ఉండే దిండును ఎంచుకోండి.