సాధారణంగా వాస్తు శాస్త్రం( Vastu Shastra ) ప్రకారం మనం ఇంటిని నిర్మించుకోవడానికి ఏ విధంగా అయితే వాస్తు నియమాలను పాటిస్తామో, అదే విధంగా ఇంటి లోపల, ఇంటి బయట ఉంచే వస్తువుల విషయంలో కూడా వాస్తు నియమాలు కచ్చితంగా పాటించాల్సిందే.ఇల్లు ఎంత వాస్తు ప్రకారం నిర్మించుకున్నప్పటికీ కూడా ఇంటి లోపల ఇంటి బయటపెట్టిన వస్తువులు మన జీవితం పైన తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి.
ఇంట్లో పెట్టుకునే వస్తువులు మాత్రమే కాకుండా ఇంటి పై టెర్రస్ మీద పెట్టే వస్తువుల విషయంలో కూడా పలు జాగ్రత్తలు తీసుకోవాలి.

అలాగే చాలా మంది ఇంటి పైన వినియోగించని అనేక వస్తువులను పాడేస్తూ ఉంటారు.అలాగే పాడైపోయిన వస్తువులు, చెత్త, చెదారం ఇంటి పైన జమ చేస్తుంటారు.అయితే టెర్రస్ పైన ఎప్పుడు కూడా పాత వస్తువులు, పాడైపోయిన వస్తువులను అస్సలు పెట్టకూడదు.
అలాగే చెత్త చెదారాన్ని జమా అస్సలు చేయకూడదు.అలా చేస్తే ఆ కుటుంబ సభ్యులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు.
అలాగే ఇంటి పైన జమ చేసిన చెత్త ( Garbage)ఆ ఇంట్లోని కుటుంబ సభ్యులకు పేదరికన్ని తెస్తుంది.

అందుకే ఇంటిపై కప్పు పై ఎప్పుడు చెత్త, చెదారన్ని జమ చేయకుండా ప్రతికూలతను తొలగించే ప్రయత్నం చేయాలి.ఇంటి టెర్రస్ పైన చెత్త ఉంటే అది మన తలభారంగా మారుతుంది.అందుకే వాటిని తీసేసి సానుకూల శక్తి ప్రసరించే విధంగా ఇంటిపైన చక్కని గార్డెన్ కూడా చేయవచ్చు.
వాస్తు ప్రకారం మన ఇళ్లల్లో పెంచుకోవాల్సిన మొక్కలను నుంచి టెర్రస్ పైన అందంగా పెంచుకుంటే అది ఇంటి శ్రేయస్సును పెంచుతుంది.ఇంటి పైకప్పును ఎప్పుడు కూడా శుభ్రంగా ఉంచుకోవడం వలన ఆ కుటుంబ సభ్యులకు సంతోషం, శ్రేయస్సు, అదృష్టం కలుగుతుంది.
అలాగే ఇంటి టెర్రస్ పైన మొక్కలు పెంచడం చాలా శుభప్రదం.మొక్కలను పెంచడం వలన పర్యావరణం శుభ్రం అవ్వడమే కాకుండా ఆ ఇంట్లోనీ కుటుంబ సభ్యుల మనసు ప్రశాంతంగా ఉంటుంది.
అందుకే టెర్రస్ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే దాని ప్రభావం ఆ కుటుంబ సభ్యుల జీవితం పై ఖచ్చితంగా పడుతుంది.కాబట్టి టెర్రస్ పైన ఉన్న చెత్త, చెదారన్ని తీసేసి అందమైన మొక్కలతో అలంకరించోకోవాలి.