ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):
సూర్యోదయం: ఉదయం 06.07
సూర్యాస్తమయం: సాయంత్రం 05.21
రాహుకాలం: ఉ.10.30 నుంచి 12.00 వరకు
అమృత ఘడియలు: సా.04.30 నుంచి 05.59 వరకు
దుర్ముహూర్తం: ఉ.08.21 నుంచి 09.06 వరకు
ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):
మేషం:

ఈరోజు మీకు ఆర్థికపరంగా లాభాలు ఉన్నాయి.కొన్ని ముఖ్యమైన విషయాలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది.ఈరోజు అనుకోకుండా ఇంటికి బంధువు వస్తారు.
వ్యాపారస్తులు ఇతరుల నుండి సలహాలు పొందుతారు.ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.
వృషభం:

ఈరోజు మీకు ఆర్థిక పరంగా ఇబ్బందులు ఉంటాయి.అనవసరమైన వస్తువులను కొనుగోలు చేస్తారు.కొన్ని ప్రయాణాలు చేస్తారు.కుటుంబ సభ్యులతో ముఖ్యమైన విషయాలలో గొడవలు జరిగే అవకాశం ఉంది.ఈరోజు వ్యాపారస్తులు శుభ ఫలితాలను పొందుతారు.మీరు పనిచేసే చోట ప్రశంసలు అందుతాయి.
మిథునం:

ఈరోజు మీకు ఆర్థికపరంగా లాభాలు ఉన్నాయి.ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.కొత్త విషయాలపై నిర్ణయాలు తీసుకుంటారు.సమయాన్ని వృథా చేయకుండా పనిపై ఆసక్తి చూపండి.అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకపోవడం మంచిది.కొత్త విషయాలు నేర్చుకోవడానికి అనుకూలంగా ఉంది.
కర్కాటకం:

ఈరోజు ఆర్థికపరంగా లాభాలు ఉన్నాయి.ఇంటిలో పండగ వాతావరణం వల్ల ఖర్చు పెరుగుతుంది.వాయిదా గా ఉన్న పనులు ఈరోజు పూర్తవుతాయి.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉంది.ఈరోజు ఒక శుభవార్త వింటారు.దానివల్ల సంతోషంగా ఉంటారు.
సింహం:

ఈరోజు ఆర్థికపరంగా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి.మీ ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండండి.మీ స్నేహితుల నుండి ముఖ్యమైన పనులు పూర్తవుతాయి.ఇతరులతో అనవసరమైన గొడవలకు దిగకపోవడం మంచిది.మీ ఆలోచన వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది.మీరు పనిచేసే చోట ఇబ్బందులు ఎదురవుతాయి.
కన్య:

ఈరోజు మీరు ఆర్థికపరంగా జాగ్రత్తగా ఉండాలి.చాలా వరకు డబ్బులు పొదుపు చేయాల్సి ఉంటుంది.కుటుంబ సభ్యుల నుండి వాదనలు జరిగే అవకాశం ఉంది.కొన్ని సమస్యలు ఈరోజు పరిష్కారమవుతాయి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో జాగ్రత్తగా ఉండాలి.లేదా భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.
తులా:

ఈరోజు ఆర్థికపరంగా లాభాలు ఉన్నాయి.ఉత్సాహపరిచే కార్యక్రమాలలో పాల్గొంటారు.మీ ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండండి.బంధువుల నుండి శుభవార్త వింటారు.దీనివల్ల సంతోషంగా ఉంటుంది.మీరు పనిచేసే చోట ప్రశంసలు అందుతాయి.
దీని వల్ల మంచి ఫలితాలు కూడా ఉంటాయి.ఈరోజు మీకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది.
వృశ్చికం:

ఈరోజు మీకు ఆర్థికపరంగా లాభాలు ఉన్నాయి.మీ ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండండి.ఈ రోజు ఏదైనా పని మొదలు పెడితే సులువుగా సాగుతుంది.ఈరోజు ఒక ముఖ్యమైన వ్యక్తిని కలవడం వల్ల ఆనందంగా ఉంటారు.కొన్ని విషయాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం వల్ల మంచి జరుగుతుంది.
ధనస్సు:

ఈరోజు మీకు ఎక్కువ ధన లాభం ఉంది.ఇతరుల నుండి మీ సొమ్ము తిరిగి వస్తుంది.దైవ దర్శనాలు వంటివి చేస్తారు.
మీ కుటుంబ సభ్యుల నుంచి సలహాలు అందుతాయి.ఉత్సాహ పరిచే కార్యక్రమాలలో పాల్గొంటారు.
దీని వల్ల మనశ్శాంతి కలుగుతుంది.వ్యాపారస్తులకు ఈరోజు అనుకూలంగా ఉంది.
మకరం:

ఈరోజు మీకు ఆర్థికపరంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.మీ ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండండి.ఇతరులతో వాదనలకు దిగక పోవడం మంచిది.కొన్ని విషయాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం వల్ల మానసికంగా మనశ్శాంతి కోల్పోతారు.మీ శత్రువుల నుండి మీకు ఉపశమనం కలుగుతుంది.ఇతరులతో జాగ్రత్తగా ఉండండి.
కుంభం:

ఈరోజు ఆర్థిక పరంగా ఇబ్బందులు ఎదురవుతాయి.దీనివల్ల బాధపడాల్సిన అవసరం లేదు.కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.ఇతరులు మీ నుండి సలహాలు తీసుకుంటారు.దీనివల్ల మీ గొప్పతనం అందరికీ తెలుస్తుంది.కొత్త విషయాలు తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తారు.ఇతరులు మిమ్మల్ని చూసి నేర్చుకునేలా ఉంటారు.
మీనం:

ఈరోజు మీకు ఆర్థికపరంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.కొన్ని ముఖ్యమైన విషయాలపై ఆసక్తి చూపుతారు.మీ ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
మీ పిల్లల భవిష్యత్ గురించి ఆలోచిస్తారు.వ్యాపార రంగంలో పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉంది.
మీరు పనిచేసే చోట ప్రశంసలు అందుతాయి.