వివాహమైన మహిళలు మంగళసూత్రం విషయంలో చేసే తప్పులు ఇవే..!

వివాహమైన మహిళకు మెడలో తాళి అందం అని పెద్దవారు చెబుతూ ఉంటారు.కానీ ప్రస్తుత రోజులలో ఫ్యాషన్ పేరుతో తాళిని తీసి పక్కన పెట్టేస్తున్నారు.

 These Are The Mistakes That Married Women Make Regarding Mangalasutra, Mangala-TeluguStop.com

ఈ ఫ్యాషన్ పేరుతో ఆ తాళి అనే పదానికి అర్థం లేకుండా పోయింది.మంగళసూత్రం అనేది భార్యాభర్తల మధ్య శాశ్వత బంధానికి గుర్తు.

మంగళసూత్రం వైవాహిక జీవితంలో ఉండే సమస్త కీడును తొలగిస్తుందని చాలామంది ప్రజలు నమ్ముతారు.శక్తి స్వరూపిణి అయిన మహిళ మెడలో మంగళసూత్రం ఉన్నంతవరకు భర్త ఆరోగ్యంగా ఉంటాడని పెద్దవారు చెబుతూ ఉంటారు.

అయితే ప్రస్తుత రోజులలో మంగళసూత్రం వేసుకునే మహిళలు ( Women )వారికి తెలియకుండా కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటారు.మరి మహిళలు చేస్తున్న ఆ పొరపాట్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Telugu Devotional, Problems, Mangala Sutra, Married, Energy-Latest News - Telugu

మహిళలు ధరించే మంగళసూత్రం( Mangala sutra ) ఎప్పుడు కూడా హృదయాన్ని తాకుతూ వక్షస్థలం కింద వరకు ఉండాలి.సౌభాగ్యానికి ప్రతికాలైన పసుపు, కుంకుమలను నిత్యం సూత్రానికి పెట్టుకోవాలి.చాలా మంది మంగళ సూత్రాలలో పగడాలు, ముత్యాలు, అమ్మవారి రూపు పెట్టుకుంటూ ఉంటారు.అయితే ఇలా అసలు చేయకూడదు.అలాగే స్త్రీలు ధరించే మంగళసూత్రానికి ఇరువైపులా ఎరుపు, నలుపు పూసలు తప్పకుండా ఉండాలి.మంగళసూత్రాలకు చాలామంది పిన్నిసులు పెడుతూ ఉంటారు.

మంగళ సూత్రాలకు ఇనుము వస్తువులను తాకకుండా చూసుకోవాలి.ఎందుకంటే ఇనుము నెగిటివ్ ఎనర్జీని( Negative energy ) గ్రహిస్తుంది.

దీంతో బంధం మధ్య అన్యోన్యత లోపిస్తుందని పండితులు చెబుతున్నారు.కాబట్టి మహిళలు పొరపాటున కూడా మంగళసూత్రానికి పిన్నిసులు తగిలించడం లాంటివి అస్సలు చేయకూడదు.

Telugu Devotional, Problems, Mangala Sutra, Married, Energy-Latest News - Telugu

ఇంకా చెప్పాలంటే కుజుడు, చంద్రుడికి ప్రతికలైనా ఈ రెండు రాళ్లు గృహ దోషాలను తొలగించి వైవాహిక బంధాన్ని మరింత పటిష్టం చేస్తాయి.సాధారణంగా మహిళలకు కుజ దోషం, కుజ గ్రహ ప్రభావం వల్ల అతి కోపం, కలహాలు, మొండితనం అనారోగ్య సమస్యలు ( Health problems )ఏర్పడతాయి.పగడం, ముత్యం, ధరించడం వల్ల వాటి నుంచి ఉపశమనం లభిస్తుంది.ఏ ఇంట్లో అయినా మహిళ ప్రశాంతంగా ఉంటే అంతకుమించిన ఆనందం ఉండదని పెద్దవారు చెబుతూ ఉంటారు.

అదే విధంగా మహిళలు ఎప్పుడూ కూడా మంగళసూత్రాన్ని తన భర్తకు తప్ప ఇతరులకు కనిపించేలా ధరించకూడదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube