గన్నవరంలో వర్షంలో చంద్రబాబు ప్రసంగం..!!

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు( Chandrababu ) శుక్రవారం గన్నవరంలో( Gannavaram ) ప్రజాగళం సభ నిర్వహించారు.ఒక్కసారిగా గన్నవరంలో వాతావరణం మారటంతో వర్షం పడింది.

 Chandrababu Speech In Rain In Gannavaram Details, Ap Elections, Chandrababu, Ga-TeluguStop.com

అయినా గాని వర్షంలోనే చంద్రబాబు ప్రసంగించడం జరిగింది.జోరుగా వర్షం పడుతున్న లెక్కచేయకుండా తడుస్తూ ప్రసంగాన్ని కొనసాగించారు.

ఈ క్రమంలో పక్కనున్న తెలుగుదేశం నాయకులు గొడుగు పట్టుకోవడం జరిగింది.జోరు వానలో చంద్రబాబు ప్రసంగాన్ని అక్కడ ప్రజలు సైతం విన్నారు.

ఈ క్రమంలో ప్రజలు ఆసక్తి చూసి చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు.

Telugu Ap, Chandrababu, Gannavaram, Tdpbjp-Latest News - Telugu

మిమ్మల్ని చూసి వరుణ దేవుడే భయపడుతున్నారన్నారు.మరో మూడు రోజులలో ఎన్నికలు ( Elections ) జరగబోతున్నాయి.కచ్చితంగా కూటమి అధికారంలోకి వస్తుంది రాజకీయ రౌడీలను తుంగలో తొక్కేస్తా అంటూ చంద్రబాబు హెచ్చరించారు.

యార్లగడ్డ వెంకట్రావు( Yarlagadda Venkatrao ) చదువుకున్న వ్యక్తి.రాజకీయాలను ఆధారంగా చేసుకోలేదు.

అమెరికా వెళ్లి తెలివితేటలతో డబ్బులు సంపాదించిన వ్యక్తి.ఇక్కడ ఉండే సైకో రౌడీయిజం చేసి భూకబ్జాలు చేసి డబ్బులు సంపాదించిన వ్యక్తి.

ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి, భవిష్యత్తు వెలగాలన్న ఆశయంతోనే.నేను పవన్ కళ్యాణ్ కలిసి పనిచేస్తున్నామని చంద్రబాబు స్పీచ్ ఇచ్చారు.

Telugu Ap, Chandrababu, Gannavaram, Tdpbjp-Latest News - Telugu

మరి కొద్ది రోజుల్లో జరగబోయే ఎన్నికలలో కూటమి గెలుపు ఖాయమని స్పష్టం చేశారు.శుక్రవారం ఉండి, ఏలూరు, గన్నవరం, మాచర్ల, ఒంగోలు నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించారు.ఎన్నికల ప్రచారానికి చివరి రోజు శనివారం మూడు సభలలో పాల్గొననున్నారు.2019 ఎన్నికల కంటే 2024 ఎన్నికలను చంద్రబాబు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని వ్యూహాత్మకంగా అడుగులు వేయటం జరిగింది.ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఎక్కడ చీలిపోకుండా బీజేపీ, జనసేన పార్టీలతో పొత్తులు పెట్టుకోవడం జరిగింది.2014లో ఈ మూడు పార్టీలు కూటమిగా ఏర్పడి పోటీ చేయగా విజయం సాధించాయి.ఇప్పుడు అదే విధంగా విజయం సాధించాలని చంద్రబాబు భావిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube