టాలీవుడ్ ఇండస్ట్రీతో( Tollywood industry ) పాటు ఇతర ఇండస్ట్రీలలో సైతం మంచి గుర్తింపును సొంతం చేసుకున్న హీరోయిన్లలో మాళవిక మోహనన్ ( Malavika Mohanan )ఒకరు.సౌత్ ఇండియాలో హీరోయిన్ గా కనిపించాలంటే మరీ సన్నగా ఉండకూడదని ఆమె చెప్పుకొచ్చారు.
శరీరాకృతి విషయంలో తాను ఎదుర్కొన్న సవాళ్ల గురించి ఆమె కామెంట్లు చేశారు.ఒకానొక సమయంలో ఎన్నో విమర్శలు వచ్చాయని ఆ విమర్శలు నన్ను ఎంతో బాధ పెట్టాయని ఆమె చెప్పుకొచ్చారు.
తనకు ఎదురైన ఒక చేదు అనుభవం గురించి ఆమె చెప్పుకొచ్చారు.ముంబైలో( Mumbai ) ఒకరోజు రాత్రి నా ఫ్రెండ్స్ తో కలిసి లోకల్ ట్రైన్ లో ప్రయాణించానని మాళవిక తెలిపారు.
ఆ కంపార్ట్ మెంట్ లో మేము కాకుండా మరెవరూ లేరని ఆమె చెప్పుకొచ్చారు.ఆ సమయంలో ఒక వ్యక్తి అందులోకి వచ్చేందుకు ప్రయత్నించాడని ఆమె అన్నారు.కంపార్ట్ మెంట్ దగ్గర ఉన్న గ్లాస్ డోర్ నుంచి తొంగి చూస్తూ ముద్దిస్తావా అని సైగ చేశాడని మాళవిక చెప్పుకొచ్చారు.

ఆ వ్యక్తి ప్రవర్తన వల్ల మేమంతా భయపడ్డామని ఆ సమయంలో ఏం చేయాలో అర్థం కాలేదనీ మాళవిక పేర్కొన్నారు. హీరోయిన్స్ లుక్స్ విషయంలో ప్రతి ఇండస్ట్రీకి కొన్ని ప్రమాణాలు ఉన్నాయని అమె చెప్పుకొచ్చారు.నేను కొంచెం బరువు పెరిగి ముంబైలో సినిమా చేయాలనుకుంటే తప్పే అవుతుందని మాళవిక అన్నారు.
వెంటనే బరువు తగ్గాలని నా మేనేజరే చెబుతాడని ఆమె తెలిపారు.కొంచెం సన్నబడి చెన్నైలో వర్క్ కోసం వెళ్తే అక్కడ వాళ్లు అంగీకరించరని మాళవిక వెల్లడించారు.మహిళల శరీరాకృతి విషయంలో తరచూ కామెంట్లు ఎదురవుతూ ఉంటాయని ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఇక్కడ పరిస్థితులను అర్థం చేసుకున్నానని ఆమె అన్నారు.21 సంవత్సరాలకే నేను నటిగా కెరీర్ ను మొదలుపెట్టానని మాళవిక మోహనన్ తెలిపారు.