తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రేక్షకులతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న చిత్రం మహేష్ బాబు( Mahesh Babu ) రాజమౌళి( Rajamouli ) కాంబోలో రాబోతున్న చిత్రం.ఈ సినిమా కోసం ప్రేక్షకులు కల్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు.
కానీ ఇప్పట్లో ఈ సినిమా రాదనుకోండి.అయితే రాజమౌళి మహేష్ బాబు కాంబో మూవీ ఈ ఏడాది జనవరిలో ప్రారంభమైన విషయం తెలిసిందే.
ఇప్పటికే రెండు షెడ్యూల్ ను పూర్తి చేసుకున్న మూవీ మేకర్స్ తాజాగా మూడవ షెడ్యూల్ ప్రారంభించారు.ఇప్పటికే హైదరాబాద్ లో మొదటి షెడ్యూల్, ఒడిశాలో రెండో షెడ్యూల్ కంప్లీట్ చేసిన రాజమౌళి తాజాగా మూడో షెడ్యూల్ స్టార్ట్ చేసేసారు.

అది ఎక్కడ అన్న విషయం మాత్రం ఇంకా తెలియడం లేదు.ఇకపోతే ఈ చిత్రంలో మలయాళ హీరో పృథ్వీ రాజ్ సుకుమారన్,( Prithviraj Sukumaran ) బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రాలు( Priyanka Chopra ) నటిస్తున్న విషయం తెలిసిందే.రాజమౌళి SSMB 29పై ఎలాంటి ప్రెస్ మీట్ పెట్టకుండానే ఆయన సైలెంట్ గా చిత్రీకరణ చేసుకుంటున్నారు.ఇకపోతే ఈ సినిమాలో ఒక ఫైట్ సీన్ హైలెట్గా నిలవబోతోందని తెలుస్తోంది.
అది కూడా సముద్రంలో బోట్స్ పైన కావడంతో ఇది ఈ సినిమాకు ప్లస్ కానుందట.

ఈ వార్తలు నిజానిజాల సంగతి పక్కన పెడితే ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.అంతేకాకుండా మూడు వేలమంది జూనియర్ ఆర్టిస్ట్ లు కూడా కనిపించే ఈ భారీ సీక్వెన్స్ కోసం ఒక పెద్ద సెటప్ కూడా చేస్తున్నారట.మే లో మొదలు పెట్టి జూన్ వరకు ఈ భారీ యాక్షన్ సీక్వెన్స్ ని రాజమౌళి చిత్రీకరిస్తారని తెలుస్తోంది.
ఇలా ఈ సినిమాకు సంబంధించి వినిపిస్తున్న ఒక్కొక్క వార్త సినిమాపై అంచనాలను భారీగా పెంచేస్తున్నాయి.ఇప్పటికే ఈ సినిమాపై ఒక రేంజ్ లో అంచనాలు ఉన్నాయి.ఈ సినిమాని రాజమౌళి హాలీవుడ్ లెవెల్లో ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.