పెరుగు.పాల నుంచి తయారు అయ్యే ఉత్పత్తుల్లో ఇది ఒకటి.
అయితే పాల కంటే పెరుగు ఎక్కువ రుచిని కలిగి ఉంటుంది.అలాగే ఆరోగ్యపరంగా ఎన్నో ప్రయోజనాలను అందిస్తుంది.
ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది తమ డైలీ డైట్ లో ఖచ్చితంగా పెరుగు ఉండేలా చూసుకుంటారు.అసలు కొందరికి పెరుగు లేకుంటే భోజనం చేసినట్లు కూడా ఉండదు.
పెరుగు లేకుండా భోజనం అనేది అసంపూర్ణం.అంతలా పెరుగుతో విడతీయలేని బంధాన్ని పెనవేసుకున్నారు.
అయితే పెరుగు ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ.ఎప్పుడు పడితే అప్పుడు తీసుకోవడం అస్సలు మంచిది కాదు.ముఖ్యంగా ఉదయం పూట పెరుగు పొరపాటున కూడా తీసుకోరాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.అసలు ఉదయం పూట పెరుగును ఎందుకు తీసుకోరాదు.? తీసుకుంటే ఎలాంటి సమస్యలు ఎదురవుతాయి.? అన్నది ఆలస్యం చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.ఉదయం పూట పెరుగు తీసుకోవడం వల్ల జలుబు, ఫ్లూ వంటి సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి.ఒకవేళ జలుబు ఫ్లూ వంటి సమస్యలు ఉంటే అవి మరింత తీవ్రతరంగా మారుతాయి.
అలాగే పెరుగులో మంచి బ్యాక్టీరియా ఉంటుంది.ఇది జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరచడంలో అద్భుతంగా సహాయపడుతుంది.
కానీ ఉదయం పూట పెరుగు తీసుకుంటే కనుక జీర్ణ వ్యవస్థ పని తీరు మెరుగు పడటం కాదు మందగిస్తుంది.

దాంతో కడుపు నొప్పి, ఎసిడిటీ, అజీర్తి, తేన్పులు వంటి సమస్యలు తీవ్రంగా సతమతం చేస్తాయి.ఇక ఆర్థరైటిస్ తో బాధ పడుతున్నవారు పెరుగును ఉదయం పూట మాత్రమే కాదు రోజు వారి ఆహారం నుంచి తొలగించేందుకు ప్రయత్నించాలి.పెరుగు ఒక పుల్లని ఆహారం.
పుల్లని ఆహారాలు కీళ్ల నొప్పులను అధికం అయ్యేలా చేస్తాయి.అందుకే పెరుగు వీలైనంత వరకు తక్కువ తీసుకునేందుకు ప్రయత్నించాలి లేదా పూర్తిగా ఎవైడ్ చేయాలి.