ప్రత్యేకమైన సువాసన, రుచి కలిగి ఉండే దాల్చిన చెక్కను వంటల్లో విరి విరిగా ఉపయోగిస్తుంటారు.కొందరైతే దాల్చిన చెక్కను పచ్చిగా కూడా నమిలి తింటుంటారు.
మరికొందరు దాల్చిన చెక్కతో టీ తయారు చేసుకుని తీసుకుంటారు.ఎలా తీసుకున్నా.
దాల్చిన చెక్క ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.ఎన్నో జబ్బులను కూడా నివారిస్తుంది.
ఇక ఆరోగ్యానికి చర్మ సౌందర్యాన్ని రెట్టింపు చేయడంలోనూ దాల్చిన చెక్క ఉపయోగపడుతుంది.అవును, దాల్చిన చెక్కతో కొన్ని కొన్ని పదార్థాలని కలిపి రాసుకుంటే.
బోలెడన్ని స్కిన్ కేర్ బెనిఫిట్స్ పొందొచ్చు.అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా దాల్చిన చెక్కను పొడి చేసి పెట్టుకోవాలి.ఇప్పుడు ఒక గిన్నెలో ఒక స్పూన్ దాల్చిన చెక్క పొడి, ఒక స్పూన్ చందనం పొడి మరియు రెండు స్పూన్ల తేనె వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి పూసుకుని.పది లేదా ఇరవై నిమిషాల పాటు డ్రై అవ్వనివ్వాలి.అనంతరం చల్లటి నీటితో ఫేస్ వాష్ చేసుకోవాలి.ఇలా వారంలో రెండు, మూడు సార్లు చేస్తే.
మచ్చలు పోయి చర్మ ఛాయ పెరుగుతుంది.
అలాగే ఒక బౌల్‌లో ఒక స్పూన్ దాల్చిన చెక్క పొడి, ఒక స్పూన్ కాఫీ పౌడర్ మరియు బాదం ఆయిల్ వేసుకుని మిక్స్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి.మెల్ల మెల్లగా స్క్రబ్ చేసుకోవాలి.ఆ తర్వాత చల్లటి నీటితో ముఖాన్ని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.మూడు రోజులకు ఒక సారి ఇలా చేస్తే డెడ్ స్కిన్ సెల్స్ పోయి.
ముఖం కాంతివంతంగా మెరుస్తుంది.
ఇక ఒక గిన్నెలో ఒక స్పూన్ దాల్చిన చెక్క పొడి, రెండు స్పూన్ల బొప్పాయి పండు గుజ్జు వేసుకుని కలుపుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఫేస్‌కు పట్టించి.పావు గంట తర్వాత గోరు వెచ్చని నీటితో శుభ్ర పరుచుకోవాలి.
ఇలా చేయడం వల్ల మొటిమలతో పాటు ముడతలు కూడా తగ్గి.ముఖం యవ్వనంగా కనిపిస్తుంది.