డీఆర్డీవో సరికొత్త రికార్డు.. 45 రోజుల్లో 7 అంతస్తుల భవనం

ఒక అంతస్తు భవనం కట్టాలంటేనే నెలల తరబడి సమయం వెచ్చించాల్సి ఉంటుంది.అదే ఏడు అంతస్తుల భవనం నిర్మించాలంటే దాదాపు ఏడాది కాలం పడుతుంది.

 Drdvo Latest Record  7 Storey Building In 45 Days , Drdo , New Record , 46 Days-TeluguStop.com

అయితే కేవలం 45 రోజుల్లోనే ఏడు అంతస్తుల భవనం నిర్మించి డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ ఆర్గనైజర్స్ (DRDO) సరికొత్త రికార్డును నమోదు చేసింది.ప్లైట్ కంట్రోల్ సిస్టమ్ కోసం బహుళ అంతస్తుల భవనాన్ని నిర్మించి అదరహో అనిపించింది.

డీఆర్డీఓ ఈ ఏడు అంతస్తుల భవన నిర్మాణాన్ని బెంగళూరులోని ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ వద్ద నిర్మించడం విశేషం.భవనాన్ని ఫ్రీ-ఇంజనీరింగ్, ప్రీకాస్ట్ మెథడాలజీతో కూడిన హైబ్రిడ్ టెక్నాలజీతో పూర్తి చేసింది.

ఎయిర్ క్రాప్ట్ ప్రోగ్రాం కోసం నిర్మించిన ఈ భవనాన్ని ఫైటర్ ఎయిర్ క్రాప్ట్ లు, ప్లైట్ కంట్రోల్ సిస్టమ్ ఏవి యోనిక్స్ అభివృద్ధికి వినియోగించనున్నారు.ఇది స్వదేశీ ఏఎంసీఏ రీసెర్చ్ అండ్ డెవలెప్ మెంట్ సౌకర్యాలను అందించనుంది.

బెంగళూరులో ఈ ఏడు అంతస్తుల భవనాన్ని భారత రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రారంభించారు.ఈ ప్రాజెక్టు నవంబర్ 22, 2021 శంకుస్థాపన జరిగింది.

నిర్మాణం ఫిబ్రవరి 1, 2022న ప్రారంభమైంది.హైబ్రిడ్ నిర్మాణ సాంకేతికతతో ఏడు అంతస్తుల భవనాన్ని పూర్తి చేయడం గొప్ప విషయమన్నారు.

ఈ బిల్డింగ్ లో కాంపోజిట్ కన్‌స్ట్రక్షన్‌ టెక్నాలజీ ద్వారా మౌలిక సదుపాయాలు అందించాలని కేంద్రమంతి సూచించారు.సంప్రదాయ నిర్మాణం తో పోలిస్తే సమయం, శ్రమను తగ్గిస్తుందన్నారు.

దీని నిర్మాణంలో ఐఐటీ మద్రాస్, ఐఐటీ రూర్కీ బృందాలు సహాయాన్ని అందించాయి.ఇందులో విద్యుత్ వ్యవస్థ, ఫైర్ ప్రోటెక్షన్ తో పాటు ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్ కూడా ఉందన్నారు.

ఇలాంటి భవనాన్ని నిర్మించడం గొప్ప విషయమే అంటున్నారు మేథావులు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube