నాగచైతన్యని చూస్తే ఆ ఫీలింగ్ వస్తుంది.. ఎప్పటికీ తనతో నటించను.. స్టార్ డాటర్ కామెంట్స్ వైరల్!

సినీ ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతున్నటువంటి నాగచైతన్య( Naga Chaitanya ) సక్సెస్ కోసం భారీ స్థాయిలో కష్టపడుతున్నారు.ఈయన స్టార్ హీరోగా ఇండస్ట్రీలో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవడం కోసం ఎంతో విభిన్నమైనటువంటి కథ చిత్రాలను ఎంపిక చేసుకున్నప్పటికీ అనుకున్న స్థాయిలో మాత్రం సక్సెస్ అందుకోలేకపోతున్నారనే చెప్పాలి.

 Sara Ali Khan Rejected To Pair With Naga Chaitanya Due To These Reasons Details,-TeluguStop.com

ఇక ఇటీవల వరుస ఫ్లాప్ సినిమాలతో సతమతమవుతున్న ఈయనకు దూత వెబ్ సిరీస్( Dhootha Web Series ) కాస్త ఊరట కలిగించింది.

ఇక ప్రస్తుతం నాగచైతన్య డైరెక్టర్ చందు మొండేటి( Chandoo Mondeti ) దర్శకత్వంలో తండేల్( Thandel ) అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాలో నాగచైతన్య ఒక జాలరి పాత్రలో కనిపించబోతున్నారు నిజజీవిత కథ ఆధారంగా రాబోతున్నటువంటి ఈ సినిమాలో నటి సాయి పల్లవి( Sai Pallavi ) హీరోయిన్గా నటిస్తున్న సంగతి తెలిసిందే.అయితే నాగచైతన్యతో ఓ సినిమా చేయడం కోసం స్టార్ కిడ్ రిజెక్ట్ చేయడం గురించి తాజాగా ఒక వార్త వైరల్ గా మారింది.

బాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్గా కొనసాగుతున్నటువంటి సారా అలీ ఖాన్( Sara Ali Khan ) ఇటీవల నాగచైతన్య గురించి ఓ సందర్భంలో చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

నాగచైతన్య సరసన నటించిన కోసం ఓ డైరెక్టర్ ఈమెను సంప్రదించారట.అయితే నాగచైతన్యతో తాను సినిమా చేయనని సారా అలీ ఖాన్ కుండబద్దలు కొట్టినట్టు చెప్పేశారు.నాగచైతన్యను చూస్తే తనకు అన్నయ్య అనే ఫీలింగ్ కలుగుతుందని అలాంటి ఫీలింగ్ ఉన్న నాకు తనతో రొమాన్స్ చేయడం అంటే చాలా కష్టతరమైన పని అందుకే తాను నాగచైతన్యతో సినిమా చేయనంటూ ఈమె చేస్తున్నటువంటి కామెంట్లు సంచలనంగా మారాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube