10 రోజుల్లో జుట్టు రాలటం తగ్గి ఒత్తుగా పెరగాలంటే సులభమైన ఇంటి చిట్కాలు

మారిన జీవనశైలి కారణంగా ప్రస్తుత రోజుల్లో వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిని జుట్టు రాలే సమస్య వేధిస్తుంది.ఈ విధంగా జుట్టు రాలిపోవడం వలన బట్టతల వచ్చేస్తుంది చిన్నవయస్సులోనే.

దాంతో మంచి ఉద్యోగం ఉన్నా పెళ్లి అవటం కూడా కష్టం అవుతుంది.ఈ జుట్టు రాలే సమస్యను నివారించటానికి ఇంటిలో సులభంగా పాటించే చిట్కాలు ఉన్నాయి.

 How To Treat Hair Fall At Home-How To Treat Hair Fall At Home-Telugu Health - తెలుగు హెల్త్ టిప్స్ ,చిట్కాలు-Telugu Tollywood Photo Image-TeluguStop.com

వాటి గురించి వివరంగా తెలుసుకుందాం

అతిమధురం వేర్లలో ఎన్నో ఔషధ గుణాలు ఉండుట వలన జుట్టు రాలే సమస్యను అరికడుతుంది.అతిమధురం వేర్లను పేస్ట్ చేసుకోవాలి.

ఒకప్పులో పాలలో పావు స్పూన్ కుంకుమ పువ్వు కలిపి దానిలో ఒక స్పూన్ అతిమధురం వేర్ల పేస్ట్ కలపాలి.ఈ పేస్ట్ ని మాడుకు, జుట్టుకు పట్టించి రాత్రంతా ఆలా వదిలేసి మరుసటి ఉదయం తలస్నానము చేయాలి.

ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.అతిమధురం వేర్లు చుండ్రు సమస్యను కూడా తగ్గిస్తాయి


గుడ్డులో జుట్టు పెరుగుదలకు సహాయపడే సల్ఫర్, ఫాస్ఫరస్, సెలేనియం, అయోడిన్, జింక్, ప్రొటీన్లు సమృద్ధిగా లభిస్తాయి.ఒక బౌల్ లో గుడ్డు తెల్లసొనను తీసుకోని దానిలో ఒక స్పూన్ ఆలివ్ ఆయిల్ మరియు తేనే కలపాలి.ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్లకు పట్టించి అరగంట తర్వాత ఘాడత తక్కువ ఉన్న షాంపూతో తలస్నానము చేయాలి.

ఈ విధంగా కొన్ని రోజుల పాటు చేస్తూ ఉంటే జుట్టు రాలే సమస్య తగ్గుతుంది.

కొబ్బరి పాలలో ప్రొటీన్లు, ఆవశ్యక కొవ్వులు సమృద్ధిగా ఉండుట వలన జుట్టు రాలే సమస్యను తగ్గించి జుట్టు బాగా పెరిగేలా చేస్తుంది.

కొబ్బరి కాయను తీసుకొని కొబ్బరిని తురిమి స్టవ్ మీద ఐదు నిమిషాల పాటు సిమ్‌లో వేడి చేయాలి.కొబ్బరి చల్లారిన తర్వాత నల్ల మిరియాల పొడి, మెంతులను వేసి నీటిని కలిపి పాలలా తయారుచేసుకోవాలి.

ఈ పాలను తలకు పట్టించి అరగంట తర్వాత తలస్నానం చేయాలి

గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండుట వలన జుట్టు రాలే సమస్యను అరికట్టి జుట్టు వేగంగా పెరిగేలా చేస్తుంది.రెండు కప్పుల వేడి నీటిలో గ్రీన్ టీ బ్యాగ్లను ముంచి, ఆ నీరు చల్లారాక తల మాడు మీద పోసి నిదానంగా మసాజ్ చేయాలి.అరగంట తర్వాత తేలికపాటి షాంపూతో తలస్నానము చేయాలి

బీట్‌రూట్‌లో విటమిన్ బీ6, విటమన్ సి,మాంగనీస్, బీటేన్, పొటాషియం సమృద్ధిగా ఉండుట వలన జుట్టు రాలే సమస్యను అరికడుతుంది.7-8 బీట్‌రూట్ ఆకులు, 5-6 గోరింటాకులను నీటిలో ఉడికించాలి.ఈ పేస్ట్ ని తలకు పట్టించి 20 నిముషాలు అయ్యాక వేడినీటితో శుభ్రం చేసుకోవాలి.ఈ విధంగా వారానికి రెండు సార్లు చేస్తే మంచి ఫలితం కనపడుతుంది.

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు