డ్రై ఫ్రూట్స్( Dry fruits ) అంటే ఆరోగ్యానికి చాలా పోషకాలను అందిస్తాయి.మన ఆరోగ్యం ఎప్పుడూ చక్కగా ఉండాలంటే డ్రై ఫ్రూట్స్ ఎన్నో విధాలుగా ఉపయోగపడతాయి.
డ్రైఫ్రూట్స్ ని తీసుకోవడం వలన శరీర ఆరోగ్యమే కాకుండా చర్మ ఆరోగ్యం కూడా చాలా చక్కగా ఉంటుంది.డ్రై ఫ్రూట్స్ లలో బాదం కూడా ఒకటి.
వీటిలో ఎన్నో పోషక విలువలు ఉంటాయి.అయితే ఎముకల నుంచి మెదడు వరకు ప్రతి అవయవాన్ని బలోపేతం చేస్తుంది.
అయితే నానబెట్టిన బాదంపప్పు తినడం వలన ఆడవాళ్లకు ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి.అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
బాదం లో ప్రోటీన్, జింక్ ఒమేగా 3 ఆమ్లాలు, కొవ్వు, విటమిన్ ఏ, ఫైబర్ లాంటి పోషకాలు పుష్కలం గా ఉంటాయి.

అయితే ఇందులో ఉండే పోషకాలు మన శరీరానికి చాలా మేలు చేస్తాయి.అంతేకాకుండా మెదడు అభివృద్ధి కోసం ప్రత్యేకంగా తినే బాదం( Almond ) లో పాలిఫినాల్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఉండడం వలన మన శరీరానికి ఆరోగ్యం పెంచుతాయి.నానబెట్టిన బాదంపప్పులను తినడం వలన ఆడవాళ్లకు ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాతో ఇప్పుడు తెలుసుకుందాం.
బాదంపప్పు నానబెట్టి తింటే జీర్ణక్రియ మెరుగుపడుతుంది.పిసిఓఎస్ సమస్యతో బాధపడుతున్న ఆడవారు తప్పకుండా నానబెట్టిన బాదంపప్పు తినడం వలన మంచి ఫలితం ఉంటుంది.
పొటాషియం, మెగ్నీషియం, మొక్కల ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది.

ఒకవేళ హార్ట్ పేషంట్ ( Heart patient )అయితే ఈ పోషకం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.ప్రతిరోజు రాత్రిపూట నానబెట్టిన బాదం పప్పులను ఉదయాన్నే తినడం వలన ఎల్ డిఎల్ అంటే చెడు కొలెస్ట్రాల్ స్థాయి కూడా తగ్గుతుంది.అంతేకాకుండా ఇందులో తక్కువ క్యాలరీలు ఉండటం వలన అధిక బరువును కూడా సులువుగా నియంత్రించవచ్చు.
ఇక బాదంలో ఉండే విటమిన్ ఈ, విటమిన్ b6 ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడతాయి.అంతేకాకుండా పదేపదే మతిమరుపు సమస్య ఉన్న కూడా ఉపశమనం కలిగిస్తాయి.ఇన్ఫెక్షన్ రిస్క్ కూడా తగ్గుతుంది.జుట్టు, చర్మ సౌందర్యాన్ని మెరుగుపరిచేందుకు కూడా బాదం బాగా పనిచేస్తుంది.







