కిల్లీ వేసుకోవడం అనేది ఒక చెడ్డ అలవాటు అనేది మనలో కొందరి అభిప్రాయం.కిల్లీ అంటే ఒక మత్తు పదార్థంగా ఎక్కువ శాతం మంది తెలుగు వారు భావిస్తారు.
అందుకే తెలుగు రాష్ట్రాల్లో కిల్లీల వాడకం చాలా తక్కువగా అని చెప్పాలి.అయితే ఉత్తరాదిన మాత్రం పాన్లకు మహా గిరాకీ ఉంటుంది.
ముసలి పిల్లల నుండి పెద్దల వారు పాన్లు వేసుకుని నోరు ఎరుపు చేసుకుంటారు.తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఎవరైనా పాన్ వేసుకుంటే వీడు బాగా చెడిపోయాడురా అనుకుంటారు.
కాని మహారాష్ట్రలో మాత్రం పాన్ తినను అంటే వింతగా చూస్తారు.

మహారాష్ట్రలోని తారా పాన్ సెంటర్లో కనీసం ఒక్కసారైనా పాన్ తినాలని అక్కడి వారు ప్రతి ఒక్కరు భావిస్తారు.తారా పాన్ సెంటర్లో పాన్ తిన్నాను అంటే గొప్పగా చూస్తారు.తారా పాన్ సెంటర్ లో 10 రూపాయల పాన్ నుండి 5000 రూపాయల వరకు ఉంటుంది.
ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండేలా పాన్ ఉంటుంది.అయిదు వేల రూపాయల పాన్‌కు చాలా ప్రత్యేకత ఉందండోయ్.
ఈ పాన్‌ను కపుల్ పాన్ అంటారు.కేవలం హెర్బల్ ఐటెంమ్స్‌ను మాత్రమే వాడుతూ తారా పాన్ సెంటర్లో పాన్లను తయారు చేస్తామంటూ నిర్వాహకులు చెబుతూ ఉంటారు.
కపుల్ పాన్‌ను హనీమూన్ కిల్లీ అని కూడా అంటారు.

కొత్తగా పెళ్లి అయిన జంటలు ఈ పాన్‌ను ఎక్కువగా తింటాయి.ముఖ్యంగా శోభనం రోజున ఈ పాన్‌ను ప్రత్యేకంగా ఆర్డర్ చేయిస్తారు.కపుల్ పాన్‌లో రెండు కిల్లీలు ఉంటాయి.
ఆ రెండిటిని కపుల్స్ ఒకరికి ఒకరు తినిపించుకోవాల్సి ఉంటుంది.కపుల్ పాన్‌లో స్వీట్‌తో పాటు నరాలను ఉత్తేజ పర్చే ఐటెంమ్స్తో పాటు రక్తంలో వేడి పుట్టించే కొన్ని మూలికలు కూడా వేస్తారట.
శృంగారం మొదలు పెట్టబోయే వారు ఖచ్చితంగా తారా పాన్ సెంటర్లోని ఆ హనీమూన్ కిల్లీని వేసుకోవాల్సిందే అంటారు స్థానికులు.మరెక్కడైనా కూడా ఇలాంటి పాన్లు లభించవు.

మొత్తానికి మహారాష్ట్రలోని ఈ తారా పాన్ సెంటర్లో లభించే కపుల్ పాన్ ఈమద్య సోషల్ మీడియా ద్వారా మరింతగా ఫేమస్ అయ్యింది.ప్రపంచ వ్యాప్తంగా హనీమూన్ కిల్లీ గురించి చర్చించుకుంటున్నారు.తారా పాన్ సెంటర్ ఆన్ లైన్ లో ఆర్డర్ ఇచ్చినా కూడా డోర్ డెలవరీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తుందట.త్వరలోనే తమ సేవలను మరింతగా విస్తరిస్తామని నిర్వాహకులు చెబుతున్నారు.