గ్యాస్ బర్నర్స్ ని రాత్రంతా వెనిగర్ లో నానబెట్టి మరుసటి రోజు ఉదయం సర్ఫ్ లేదా సబ్బు ని ఉపయోగించి బ్రష్ సాయంతో రుద్దితే మురికి అంతా పోయి కొత్తవాటిలా మెరుస్తూ ఉంటాయి.అంతేకాకుండా బర్నర్స్ లో ఉండే హొల్స్ కూడా బాగా శుభ్రం అయ్యి గ్యాస్ కూడా బాగా వచ్చి మంట బాగా వస్తుంది.
నిమ్మకాయలు ఎక్కువగా ఉన్నప్పుడు వారి రసాన్ని తీసి ఐస్ ట్రై లలో పోసి ఫ్రీజ్ చేసుకోవాలి.నిమ్మకాయ అవసరం అయ్యినప్పుడు ఒక ఐస్ క్యూబ్ తీసుకోని వాడుకుంటే సరిపోతుంది.ఇలా వాడుకోవటం వలన సమయం కూడా బాగా ఆదా అవుతుంది.
మసాలాలు మిక్సీ చేసినప్పుడు మిక్సీ జార్ మసాలా వాసన వస్తూ ఉంటుంది.ఆ మసాలా వాసనలు పోవాలంటే మిక్సీ జార్ తోమటానికి ముందు మిక్సీ జార్ లో నీటిని మరియు షొప్ లిక్విడ్ ని వేసి ఒకసారి మిక్సీ చేసి ఆ తర్వాత కడిగితే మసాలా వాసనలు పోతాయి.
స్విచ్ బోర్డు లను శుభ్రం చేయటానికి నెయిల్ పాలిష్ రిమూవర్ బాగా పనిచేస్తుంది.
నెయిల్ పాలిష్ రిమూవర్ ని డైరెక్ట్ గా స్విచ్ బోర్డు మీద వేయకూడదు.ఎందుకంటే షాక్ కొట్టే ప్రమాదం ఉంది.
అందువల్ల నెయిల్ పాలిష్ రిమూవర్ ని ఒక క్లాత్ మీద తీసుకోని స్విచ్ బోర్డు మీద రుద్దితే స్విచ్ బోర్డు తళతళ మెరుస్తాయి.