పెరిగిపోతున్న ఫాస్ట్ ఫుడ్ కల్చర్ లో మనిషికి ఆరోగ్య సమస్యలు కూడా అంతకంటే ఎక్కువగా పెరిగిపోతున్నాయి.ముఖ్యంగా అధికబరువుతో చిన్నా,పెద్దా అందరూ అనేక రకాల ఇబ్బందుల పాలవుతున్నారు.
అంతేకాదు ఊబకాయం వల్ల గుండె వ్యాధులు కూడా ఎక్కువ అవుతున్నాయి.నష్ట నివారణ కోసం డైట్ చేయడం,చెమట బయటకి వచ్చేలా పరుగులు తీయడం లాంటి పనులు చేస్తూ అలసిపోతున్నారు.
ఇంతలా కష్టపడి ప్రణాలమీదకి తెచ్చుకోకుండా ఉండేందుకు జీలకర్ర చాలా బాగా ఉపయోగపడుతుంది.ప్రతీరోజు ఒక చెమ్చాడు జీలకర్రను సేవించడం ద్వారా మూడింతలు త్వరగా ఫ్యాట్ కరుగుతుంది.జీలకర్ర తినడం వలన శరీరంలోని క్యాలరీలు బర్న్ అవడమే కాకుండా జీర్ణశక్తిని మరింతగా పెంపొందుతుంది.జీలకర్రతో ఫ్యాట్ తగ్గించే విధానం ఎలాగో చూడండి.
రాత్రిళ్లు రెండు చెమ్చాల జీలకర్రను నీటిలో నానబెట్టాలి.ఉదయాన్నే ఆ నీటిని వేడిచేసి తేలిన జీలకర్రను తొలగించాలి.ఇప్పుడు ఆ నీటిలో ఒక స్పూను నిమ్మరసం కలుపుకొని పరగడుపునే ఖాళీ కడుపుతో తాగాలి.రెండు వారాలు ఇలా చేయడం ద్వారా మంచి ఫలితాలు కనిపిస్తాయి.
అలాగే జీలకర్రతో పాటు అల్లం, నిమ్మ రసాన్ని కలిపి తీసుకోవచ్చు.దీని ద్వారా మరింత త్వరగా బరువు తగ్గే అవకాశం ఉంది.

ఇందుకోసం ముందుగా అల్లాన్ని చిన్న ముక్కలుగా తరుక్కోవాలి.తరువాత కేరెట్‌తో పాటు ఇతర కూరగాయలు ఉడికించుకోవాలి.దీనిలో జీలకర్ర పొడి, నిమ్మరసం, అల్లం ముక్కలు వేసుకుని సూప్ తయారు చేసుకోవాలి.ప్రతీరోజూ రాత్రి దీనిని సేవించడం ద్వారా బరువు సులభంగా తగ్గవచ్చు.
ఇలా 20 రోజులు మీరు ఎంచుకునే పద్దతిని క్రమం తప్పకుండా పాటిస్తే తప్పకుండా బరువు తగ్గి.ఆరోగ్యంగా ఉంటారు.