మీ జుట్టు నెల రోజుల్లో ఒత్తుగా మారాలా? అయితే ఈ రెమెడీ మీ కోసమే!

కొందరికి జుట్టు చాలా ఒత్తుగా ఉంటుంది.కానీ కొందరి జుట్టు మాత్రం పలుచ‌గా ఉంటుంది.

 Best Home Remedy For Getting Thick Hair! Home Remedy, Thick Hair, Hair Care, Hai-TeluguStop.com

ఇలాంటి వారు ఒత్తుగా ఉన్న వారి జుట్టును చూస్తే కాస్త అసూయ కలగడం సర్వసాధారణం.ఈ క్రమంలోనే త‌మ‌ జట్టు పలుచ‌గా ఉందని తెగ మదన పడిపోతూ ఉంటారు.

కానీ వర్రీ వద్దు.మీరు కూడా మీ జుట్టును ఒత్తుగా మార్చుకోవచ్చు.

అది కూడా నెల రోజుల్లో.అందుకు ఇప్పుడు చెప్పబోయే హోమ్ రెమెడీ చాలా ఎఫెక్టివ్ గా పని చేస్తుంది.

మరి ఆ రెమెడీ ఏంటి అనేది ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా ఒక ఉల్లిపాయ( Onion )ను తీసుకుని తొక్క తొలగించి ముక్కలుగా కట్ చేసుకోవాలి.ఈ ఉల్లి ముక్క‌ల‌ను మిక్సీ జార్ లో వేసి మెత్తగా గ్రైండ్ చేసి.స్ట్రైన‌ర్ స‌హాయంతో జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.

ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో అర కప్పు పెరుగు వేసుకోవాలి.అలాగే నాలుగు టేబుల్ స్పూన్లు కొబ్బరి పాలు( Coconut Milk ), నాలుగు టేబుల్ స్పూన్లు ఉల్లిపాయ జ్యూస్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి.

చివ‌రిగా రెండు టేబుల్ స్పూన్లు అలోవెరా జెల్‌( Aloe Vera Gel ), రెండు టేబుల్ స్పూన్లు ఆవ నూనె వేసుకొని మరోసారి అన్ని కలిసేంత వరకు మిక్స్ చేయాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.గంట లేదా గంటన్నర అనంతరం మైల్డ్ షాంపూను యూస్ చేసి హెయిర్ వాష్ చేసుకోవాలి.

వారానికి రెండు సార్లు ఈ రెమెడీని పాటిస్తే ఎంత పల్చగా ఉన్నా సరే నెల రోజుల్లోనే జుట్టు ఒత్తుగా పెరగడం ప్రారంభమవుతుంది.చాలా త్వరగా ఒత్తైన జుట్టు మీ సొంతం అవుతుంది.పైగా ఈ రెమెడీని పాటించడం వల్ల కురులు షైనీ గా, సిల్కీగా మెరుస్తాయి.

హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది.చుండ్రు సమస్య దూరం అవుతుంది.

మరియు జుట్టు చిట్లడం, విరగడం వంటివి కూడా అదుపులోకి వస్తాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube