దక్షిణాది సినీ ఇండస్ట్రీలో నటిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న తమన్నా(Thamanna) గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.నటిగా ఇండస్ట్రీలో దాదాపు దశాబ్దన్నర కాలం పైగా కొనసాగుతూ వరుస అవకాశాలను అందుకుంటున్న తమన్నా గత కొద్దిరోజులుగా తన వ్యక్తిగత విషయాలు వల్ల వార్తల్లో నిలుస్తున్నారు.
ప్రముఖ బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ(Vijay Varma) తో ప్రేమలో ఉన్నారంటూ వార్తలు హల్చల్ చేస్తున్నాయి.అయితే ఈ వార్తలకు అనుగుణంగానే తమన్న విజయవర్మ కలిసి కనిపించడం గమనార్హం.
ఇలా వీరిద్దరూ చట్టా పట్టాలేసుకొని ముంబై వీధులలో కలిసి తిరుగుతున్నారు.

అయితే వీరిద్దరూ కలిసి లవ్ స్టోరీ 2 సిరీస్ లో( Love Stories 2 ) చాలా బోల్డ్ సన్నివేశాలలో కూడా నటించబోతున్నారని తెలుస్తుంది.ఇలా వీరిద్దరూ జంటగా కనిపించడంతో తప్పకుండా రిలేషన్ లో ఉన్నారని కొద్ది రోజులలోనే వీరి ప్రేమ విషయాన్ని ప్రకటించబోతున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి.అయితే తమన్నా విజయ్ మాత్రం తాము మంచి స్నేహితులమని చెబుతున్నారు.
ఇక తమన్నా విజయ్ కూడా అందరిలాగే స్నేహమంటూ చివరికి తమ ప్రేమ విషయాన్ని బయట పెడతారని భావిస్తున్నారు.అయితే తమన్నాను పెళ్లి చేసుకోవాలంటే తన తల్లి పెట్టిన ఈ కండిషన్ లు ఒప్పుకోవాల్సిందేనని తెలుస్తుంది.

మరి తమన్నాను పెళ్లి చేసుకోవాలంటే ఎలాంటి కండిషన్లకు ఒప్పుకోవాలి అనే విషయానికి వస్తే తమన్నా పెళ్లి విషయంలో తన తల్లిదండ్రులు ఎలాంటి ఆంక్షలు పెట్టలేదట తన కుమార్తె ఎవరిని ఇష్టపడి పెళ్లి చేసుకున్నా తమకు అభ్యంతరం లేదని తెలిపారు.అయితే తన కుమార్తె చిన్నప్పటినుంచి చాలా సెన్సిటివ్ గా పెరిగిందని,తనని చేసుకోపోయేవాడు తనని ఏమాత్రం ఇబ్బంది పెట్టకుండా తనకు నచ్చిన విధంగానే ఉండనివ్వాలని తెలిపారు.తనకు ఇష్టం లేకుండా తనకు వచ్చే భర్త ఎలాంటి పనులు చేయకూడదని తనని కష్టపెట్టకూడదని ఈ కండిషన్లకు కచ్చితంగా ఒప్పుకోవాలి అంటూ తమన్నా తల్లి కండిషన్స్ పెట్టినట్టు తెలుస్తుంది.







