ఈ ఫుడ్స్ డైట్‌లో ఉంటే మౌత్ అల్సర్ ద‌రి చేర‌నే చేర‌దు..తెలుసా?

మౌత్ అల్స‌ర్‌(నోటి పూత‌).పిల్ల‌లు, పెద్ద‌లు అనే తేడా లేకుండా ఎంద‌రినో త‌ర‌చూ వేధించే కామ‌న్ స‌మ‌స్య ఇది.

 These Foods Help To Prevent From Mouth Ulcer!  Foods, Mouth Ulcer, Latest News,-TeluguStop.com

మౌత్ అల్స‌ర్ చిన్న స‌మ‌స్యే అయిన‌ప్ప‌టికీ.దాని కార‌ణంగా వ‌చ్చే నొప్పి మాత్రం ఎంతో తీవ్రంగా ఉంటుంది.

అందుకే మౌత్ అల్స‌ర్ అంటేనే చాలా మంది భ‌య‌ప‌డిపోతుంటారు.అయితే నోటి పూత వ‌చ్చాక బాధ ప‌డ‌టం కంటే రాకుండా జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌డం ఎంతో మేలని అంటున్నారు నిపుణులు.

మ‌రి ఇంకెందుకు ఆల‌స్యం ఆ ఫుడ్స్ ఏంటో తెలుసుకుందాం ప‌దండీ.

మౌత్ అల్స‌ర్‌కు అడ్డు క‌ట్ట వేయ‌డంలో ఫోలిక్ యాసిడ్ ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది.

అందువ‌ల్ల, బొప్పాయి పండు, ఆరెంజ్‌, అర‌టి పండు, అవ‌కాడో, బ్రొకోలీ, క్యాలీఫ్ల‌వ‌ర్‌, బెండ‌కాయ‌, క్యాప్సిక‌మ్‌, ప‌చ్చి బీట్‌రూట్‌, చికెన్ లివ‌ర్‌, రెడ్ బీన్స్‌, బాదం ప‌ప్పు, పిస్తా ప‌ప్పు, వాల్ న‌ట్స్‌, గుడ్డు, ఆకుకూర‌లు వంటివి ఆహారంలో భాగంగా చేసుకుంటే గ‌నుక శ‌రీరానికి ఫోలిక్ యాసిడ్ పుష్క‌లంగా అందుతుంది.ఫ‌లితంగా మౌత్ అల్స‌ర్ ద‌రి చేర‌కుండా ఉంటుంది.

Telugu Folic Acid, Foods, Tips, Iron, Latest, Mouth Ulcer-Telugu Health - తె

అలాగే శ‌రీరంలో ఐర‌న్ త‌గ్గితే ర‌క్త హీన‌త బారిన ప‌డ‌తార‌ని అంద‌రికీ తెలుసు.అయితే ఐర‌న్ లోపం వ‌ల్ల నోటి పూత సైతం త‌ర‌చూ ఇబ్బంది పెడుతుంటుంది.అందుకే ఐర‌న్ పొంద‌డం కోసం ఖ‌ర్జూరాలు, నువ్వులు, గుమ్మ‌డి కాయ గింజ‌లు, డార్క్ చాక్లెట్స్‌, ఎండు ద్రాక్ష‌లు, ఓట్స్‌, మెంతికూర‌, క్యారెట్‌, పాలు, పెరుగు, ప‌న్నీర్‌, వేరుశ‌న‌గ‌లు, కిడ్నీ బీన్స్ వంటి ఆహారాల‌ను డైట్‌లో చేర్చుకోవాలి.త‌ద్వారా త‌ర‌చూ మౌత్ అల‌ర్స్ బారిన ప‌డ కుండా ఉండొచ్చు.

Telugu Folic Acid, Foods, Tips, Iron, Latest, Mouth Ulcer-Telugu Health - తె

ఇక ఈ ఫుడ్స్‌తో పాటు నోటిని ఎప్పుడూ ప‌రిశుభ్రంగా ఉంచుకోవాలి.ఉద‌యం, సాయంత్రం బ్రెష్ చేసుకోవాలి.మ‌రియు క్రమం తప్పకుండా దంత పరీక్షలు చేయించుకుంటూ కూడా ఉండాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube