ఎంత తీవ్ర‌మైన ద‌గ్గు అయినా ఈ డ్రింక్‌ను తాగితే ఇట్టే త‌గ్గిపోతుంది!

ప్రస్తుతం చలికాలం కొనసాగుతున్న సంగతి తెలిసిందే.ఈ సీజన్‌లో పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా దాదాపు అందరినీ ఇబ్బంది పెట్టే కామన్ సమస్యల్లో దగ్గు ఒక‌టి.

 These Drink Help To Get Rid Of Cough! Super Drink, Cough, Latest News, Health Ti-TeluguStop.com

అయితే ఒక్కోసారి దగ్గు పట్టుకుని వదలదు.అలాంటి సమయంలో ఏం చేయాలో తెలీక ద‌గ్గును ఎలా వదిలించుకోవాలో అర్థంగాక సతమతం అయిపోతుంటారు.

ఈ క్రమంలోనే మెడిక‌ల్ షాప్‌లో లభించే కాఫ్ సిరప్స్‌ను తెగ‌ వాడేస్తుంటారు.కానీ, ఎలాంటి ఖర్చు లేకుండా ఇంట్లో త‌యారు చేసుకునే ఒక సింపుల్ అండ్ ఎఫెక్టివ్ డ్రింక్‌తో ఎంత తీవ్ర‌మైన ద‌గ్గును అయినా తగ్గించుకోవచ్చు.

మరి ఇంకెందుకు ఆలస్యం ఆ సూప‌ర్ డ్రింక్ ఏంటో.? దాన్ని ఎలా త‌యారు చేసుకోవాలో.? ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒక లీటర్ వాటర్ ను పోయాలి.

వాటర్ కాస్త హీట్ అవ్వగానే అర గుప్పెడు మెంతికూర, ఐదారు తులసి ఆకులు, అర స్పూన్ సోంపు, రెండు దంచిన యాలకులు వేసి ప‌ది నుంచి పదిహేను నిమిషాల పాటు బాగా మరిగించాలి.ఆపై వాట‌ర్‌ను ఫిల్ట‌ర్ చేసుకుని గోరువెచ్చగా అయిన తర్వాత వ‌న్‌ టేబుల్ స్పూన్ అల్లం ర‌సం మిక్స్ చేసి సేవించాలి.

ఇలా ఉద‌యం, సాయంత్రం తీసుకుంటే ద‌గ్గు చాలా అంటే చాలా త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది.శ్వాస సంబంధిత స‌మ‌స్య‌ల నుంచి ఉప‌శ‌నం ల‌భిస్తుంది.మ‌రియు జ‌లుబు కూడా దూరం అవుతుంది.

ఇక ఈ సూప‌ర్ డ్రింక్‌తో పాటుగా మ‌రికొన్ని జాగ్ర‌త్త‌లు తీసుకుంటే ఇంకా మంచిది.ముఖ్యంగా ద‌గ్గు వేధిస్తున్న‌ప్పుడు ద్ర‌వ ప‌దార్థాలు ఎక్కువ‌గా తీసుకోవాలి.రోజుకు క‌నీసం ఒక్క సారి ఆవిరి ప‌ట్టాలి.

చ‌ల్ల‌టి నీటిని కాకుండా గోరు వెచ్చ‌ని నీటినే సేవించాలి.విట‌మిన్ సి పుష్క‌లంగా ఉండే ఆహారాల‌ను తీసుకోవాలి.

పైన‌ల్‌గా ద‌గ్గు స‌మ‌స్య ఉన్న‌ప్పుడు ఇత‌రుల‌కు దూరంగా ఉండాలి.లేదంటే వారికి ద‌గ్గు అంటుకుంటుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube