ఆహా ఓటిటిలో “అన్ స్టాపబుల్” టాకీ షో దేశంలోనే నెంబర్ వన్ టాకీ షోగా నిలిచింది.ముఖ్యంగా హోస్ట్ గా బాలకృష్ణ మంచి ఎంటర్టైన్మెంట్ పండిస్తూ వేస్తున్న ప్రశ్నలు.
ఇంకా పంచ్ డైలాగులు చూసే ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.మొదటి సీజన్ కి బాగా ఆదరణ రావడంతో రెండో సీజన్ లో చాలామంది సినిమా సెలబ్రిటీలతో పాటు రాజకీయ నాయకులు వస్తున్నారు.
పరిస్థితి ఇలా ఉంటే ఎపిసోడ్ స్ట్రీమింగ్ అవ్వకముందే ప్రోమోలు… ఎపిసోడ్ లు సోషల్ మీడియాలో లీక్ అయిపోతున్నాయి.
దీంతో తమకు వాణిజ్యపరంగా నష్టం వస్తుందని అర్హ మీడియా బ్రాడ్ కాస్టింగ్ ఢిల్లీ హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేసింది.
దీనిపై విచారణ చేపట్టిన కోర్టు.ఈ టాక్ షో అనధికారికంగా స్ట్రీమింగ్ మరియు ప్రసారాలను నిలిపివేయాలని… సోషల్ మీడియాలో అందుకు సంబంధించి కంటెంట్ లింకులు తొలగించాలని.
కేంద్రానికి మరీ ఇంటర్నెట్ సేవల సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది.దీనిలో భాగంగా ఇంజక్షన్ ఆర్డర్స్ ఇస్తున్నట్లు జస్టిస్ సంజీవ్ సచ్ దేవ్ ధర్మాసనం పేర్కొంది.







