అత్యంత ప్రసిద్ధి చెందిన ఆకుకూరల్లో కొత్తిమీర( coriander leaves _ ఒకటి.నాన్ వెజ్ వంటల్లో, రోజూవారీ కూరల్లో, బిర్యానీ పులావ్ వంటి స్పెషల్ రైస్ ఐటమ్స్ లో కొత్తిమీరను విరివిగా వాడుతుంటారు.
ఆహారం రుచి మరియు ఫ్లేవర్ ను పెంచడంలో కొత్తిమీరకు మరొకటి సాటి లేదు.అలాగే ఆరోగ్యానికి కూడా కొత్తిమీర చాలా మేలు చేస్తుంది.
అంతే కాదండోయ్ చర్మ సౌందర్యాన్ని మెరుగుపరిచే సత్తా కూడా కొత్తిమీరకు ఉంది.కొత్తిమీరతో చర్మానికి మెరుగులు పెట్టవచ్చని సౌందర్య నిపుణులు చెబుతున్నారు.
మరి కొత్తిమీరను ఏ సమస్యకు ఏ విధంగా వాడాలి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.
యంగ్ ఏజ్ లోనే కొందరికి ముఖంపై ముడతలు ఏర్పడుతుంటాయి.అలాంటివారు రెండు టేబుల్ స్పూన్లు అలోవెరా జెల్ లో నాలుగు నుంచి ఐదు టేబుల్ స్పూన్లు ఫ్రెష్ కొత్తిమీర జ్యూస్, హాఫ్ టేబుల్ స్పూన్ విటమిన్ ఈ ఆయిల్ వేసుకుని బాగా మిక్స్ చేస్తే మంచి క్రీమ్ రెడీ అవుతుంది.ఈ క్రీమ్ ను రోజూ నైట్ నిద్రించే ముందు ముఖానికి అప్లై చేసుకుని మసాజ్ చేసుకోవాలి.
నిత్యం ఇలా చేస్తే ముఖం పై ముడతలు, గీతలు మాయమవుతాయి.స్కిన్ టైట్ గా మరియు యవ్వనంగా మారుతుంది.అలాగే ఒక్కోసారి ముఖం కాంతి హీనంగా మారిపోతూ ఉంటుంది.అలాంటి సమయంలో కొత్తిమీరను పేస్ట్ చేసి అందులో వన్ టేబుల్ స్పూన్ పాలు, వన్ టేబుల్ స్పూన్ తేనె, వన్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ వేసి మిక్స్ చేసుకోవాలి.
ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని 20 నిమిషాల అనంతరం వాటర్ తో క్లీన్ చేసుకోవాలి.ఈ విధంగా చేస్తే చర్మం కాంతివంతంగా మారుతుంది.
అందంగా మెరుస్తుంది.
ఇక మొండి మచ్చలు, మొటిమలతో ఇబ్బంది పడుతున్న వారు కొత్తిమీర జ్యూస్ లో పావు టీ స్పూన్ ఆర్గానిక్ పసుపు, వన్ టేబుల్ స్పూన్ తేనె కలిపి ముఖానికి అప్లై చేసుకోవాలి.పూర్తిగా డ్రై అయినాక వాటర్ తో క్లీన్ చేసుకోవాలి.రెగ్యులర్ గా ఈ రెమెడీని పాటిస్తే మొటిమలు పరార్ అవుతాయి.
మచ్చలు క్రమంగా తగ్గుముఖం పడతాయి.