మలబద్ధకం మదన పెడుతుందా? అయితే ఖాళీ కడుపుతో ఈ టీ తాగండి!

మలబద్ధకం.అత్యంత సాధారణంగా వేధించే సమస్యల్లో ఇది ఒకటి.అయితే మలబద్ధకాన్ని చాలా మంది తక్కువ అంచనా వేస్తుంటారు.ఈ క్రమంలోనే దాన్ని నిర్లక్ష్యం చేస్తుంటారు.అయితే మలబద్ధకం అనేది చిన్న సమస్యగానే అనిపించినా.నిర్లక్ష్యం చేస్తే అనేక అనారోగ్య సమస్యలను తెచ్చి పెడుతుంది.

 If You Drink This Tea On An Empty Stomach, You Will Get Rid Of Constipation! Con-TeluguStop.com

అందుకే వీలైనంత త్వరగా మలబద్దకాన్ని వదిలించుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

అయితే మలబద్ధకం దూరం అవ్వాలంటే మందులు వాడాల్సిన అవసరం ఏమీ లేదు.

చిన్న చిన్న ఇంటి చిట్కాలు పాటిస్తే చాలా సులభంగా దాని బారి నుంచి బయటపడొచ్చు.ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోయే టీని ఉదయాన్నే ఖాళీ కడుపుతో తీసుకుంటే మలబద్ధకం సమస్య పరార్ అవ్వడం ఖాయం.

మరింకెందుకు ఆలస్యం ఆ టీ ఏంటి.? దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి.? వంటి విషయాలపై ఓ లుక్కేయండి.

ముందుగా ఒక ఆరెంజ్ పండును తీసుకుని ఉప్పు నీటిలో శుభ్రంగా కడగాలి.

ఆపై తొక్కను సపరేట్ చేసుకొని పెట్టుకోవాలి.ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని ఒకటిన్నర గ్లాస్ వాటర్ పోయాలి.

వాటర్ హీట్ అవ్వగానే అందులో ఆరెంజ్ తొక్కలు, వన్ టేబుల్ స్పూన్ అల్లం తరుగు.చిన్న దాల్చిన చెక్క, రెండు యాలకులు వేసి పది నుంచి పదిహేను నిమిషాల పాటు మరిగించాలి.

ఆపై స్ట‌వ్ ఆఫ్ చేసుకుని మరిగించని నీటిని స్ట్రైనర్ సహాయంతో ఫిల్టర్ చేసుకోవాలి.

Telugu Tips, Latest, Orange Peel Tea-Telugu Health Tips

ఈ వాటర్ లో వన్ టేబుల్ స్పూన్ తేనె ను మిక్స్ చేస్తే ఆరెంజ్ పీల్ టీ సిద్ధమవుతుంది.ఈ ఆరెంజ్ పీల్ టీ ఉదయాన్నే ఖాళీ కడుపుతో సేవించాలి.ప్రతిరోజు ఈ టీను తీసుకుంటే జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది.

దాంతో మలబద్ధకం మాత్రమే కాదు గ్యాస్, ఎసిడిటీ, కడుపు ఉబ్బరం వంటి ఇతర జీర్ణ సంబంధిత సమస్యలు సైతం దూరం అవుతాయి.కాబట్టి మలబద్ధకం సమస్యతో తీవ్రంగా మదన పడుతున్నవారు కచ్చితంగా తమ డైట్ లో ఈ ఆరెంజ్ పీల్ టీను చేర్చుకునేందుకు ప్రయత్నించండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube