జామకాయలతో కలిగే ఈ ప్రయోజనాల గురించి తెలిస్తే వదలకుండా తింటారు..!

జామకాయ ( Guava )తింటే సంపూర్ణ ఆరోగ్యం మన చేతిలో ఉన్నట్టే అని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.కానీ చాలామంది వీటిని తినటానికి పెద్దగా ఆసక్తి చూపించరు.

 If You Know About These Benefits Of Guavas, You Will Eat Them Without Stopping,-TeluguStop.com

జామకాయలో ఎన్నో అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నాయి.అందుకే జామకాయను తినడం వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.

ప్రస్తుతం ఈ సీజన్లో విరివిగా లభించే జామకాయను ఇష్టంగా తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.అయితే కొన్ని జామకాయ లోపల గుజ్జు తెల్లగా ఉంటే మరికొన్నిటిలో లేత గులాబీ రంగులో ఉంటాయి.

వీటిని అధికంగా తీసుకోవడం చాలా ముఖ్యం.చిన్నపిల్లల నుండి వృద్ధుల వరకు జామ పండును తీసుకోవడం వలన ఆరోగ్యానికి చాలా మంచిది.

Telugu Calcium, Diabetes, Folic Acid, Guava, Tips, Iron, Phosphorus, Potassium,

జామకాయలలో విటమిన్ సి, విటమిన్ ఏ, విటమిన్ బి, క్యాల్షియం, ఫాస్ఫరస్, పొటాషియం, ఐరన్, ఫోలిక్ యాసిడ్ లాంటివి సమృద్ధిగా ఉంటాయి.అంతే కాకుండా జీర్ణశక్తిని పెంచే ఫైబర్ కూడా ఉంటుంది.జామా పండును చిన్న చిన్న ముక్కలుగా చేసి మంచినీటిలో వేసి మూడు గంటలు అయ్యాక ఆ నీటిని తాగడం వలన వేసవికాలంలో దప్పిక కూడా తీరుతుంది.ఇక మారిన జీవనశైలి, ఒత్తిడి, సరైన ఆహారపు అలవాట్లు లేకపోవడం లాంటి కారణాలతో మలబద్ధకం( Constipation ) లాంటి సమస్యలు వస్తాయి.

అయితే మలబద్ధకం సమస్యను అశ్రద్ధ చేస్తే ఎన్నో ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి.కానీ జామకాయ మలబద్దకం సమస్యకు మంచి పరిష్కారం అని చెప్పవచ్చు.ఎందుకంటే జామకాయలో 688 మిల్లీగ్రాముల పొటాషియం ఉంటుంది.

Telugu Calcium, Diabetes, Folic Acid, Guava, Tips, Iron, Phosphorus, Potassium,

అంటే అరటి పండులో కన్నా 63% ఎక్కువగా పొటాషియం ఉంటుంది.ఇక బాగా పండిన జామపండును కోసి కొద్దిగా మిరియాల పొడిని జల్లి, నిమ్మరసం కలుపుకొని తినడం వలన తరచూ వేధించే మలబద్ధకం సమస్య నుండి బయటపడవచ్చు.ఇక ప్రతిరోజు జామకాయ తినడం వలన చిగుళ్ళు, దంతాలు కూడా గట్టిపడతాయి.

ఇందులో విటమిన్ సి ఎక్కువగా ఉండడం వలన చిగుళ్ళ నుండి రక్తస్రావం కూడా ఆగిపోతుంది.ఇక మధుమేహం ( Diabetes )ఉన్నవారు జామకాయను కచ్చితంగా తినాలి.ఇక జామ పండులో ఉన్న విటమిన్ సి కారణంగా వైరస్ వలన వచ్చే జలుబు కూడా తగ్గిపోతుంది.ఇక బరువు తగ్గడానికి కూడా జామకాయ ఒక దివ్య ఔషధం అని చెప్పవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube