బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రిటీ కపుల్స్ గా మంచి గుర్తింపు పొందిన వారిలో రణవీర్ సింగ్( Ranveer Singh ) దీపిక పదుకొనే( Deepika Padukone ) జంట ఒకటి.వీరిద్దరూ ఇండస్ట్రీలో హీరో హీరోయిన్లుగా కొనసాగుతూ ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకున్నారు.
ఇలా స్టార్ సెలబ్రిటీలుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న వీరిద్దరూ ప్రేమలో పడి 2018 వ సంవత్సరంలో కుటుంబ సభ్యుల సమక్షంలో ఇటలీలో వివాహం చేసుకున్నారు.ఇలా పెళ్లి తర్వాత వీరిద్దరూ పూర్తిస్థాయిలో సినిమాలపై ఫోకస్ పెట్టి వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.
ఇలా పెళ్లి జరిగి సుమారు 6 సంవత్సరాల అవుతున్న తరుణంలో ఈ జంట తల్లిదండ్రులుగా ప్రమోట్ అయ్యారు.ఈ ఏడాది మొదట్లో దీపికా పదుకొనే తన ప్రెగ్నెన్సీ విషయాన్ని తెలియజేస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు.ఇక ఈమె తరచు తన ప్రెగ్నెన్సీకి సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకునేవారు.సెప్టెంబర్ 8వ తేదీ ఈ జంట పండంటి ఆడబిడ్డకు( Baby Girl ) జన్మనిచ్చారు.
ఇలా కూతురు పుట్టినప్పటికీ తన కూతురు ఎలా ఉంటుందనే విషయాన్ని మాత్రం ఈమె రివీల్ చేయలేదు.
ఇకపోతే తాజాగా దీపావళి పండుగను పురస్కరించుకొని ఈమె తన కుమార్తె ఫోటోలను షేర్ చేశారు కానీ తన ఫేస్ మాత్రం చూపించలేదు అలాగే తన కుమార్తె పేరును కూడా ఈ సందర్భంగా తెలియజేశారు.తన కుమార్తెకు దీపికా పదుకొనే దువా పదుకొణె సింగ్( Dua Padukone Singh ) అని నామకరణం చేసినట్లు వెల్లడించారు.దువా అంటే ప్రార్థన.
మా ప్రేయర్స్కు సమాధానమే ఈమె అని తెలియజేస్తూ తన కూతురు పాదాల ఫోటోలను షేర్ చేయడంతో ఎంతోమంది సినీ సెలబ్రిటీలు సైతం ఈ ఫోటో పై స్పందిస్తూ ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.ఇక నేటిజన్స్ కూడా తన కుమార్తె పేరు చాలా బాగుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు.