కూతురి పేరును రివీల్ చేసిన దీపికా… ఆ పేరుకు అర్థం ఏంటో తెలుసా?

బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రిటీ కపుల్స్ గా మంచి గుర్తింపు పొందిన వారిలో రణవీర్ సింగ్( Ranveer Singh ) దీపిక పదుకొనే( Deepika Padukone ) జంట ఒకటి.

వీరిద్దరూ ఇండస్ట్రీలో హీరో హీరోయిన్లుగా కొనసాగుతూ ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకున్నారు.

ఇలా స్టార్ సెలబ్రిటీలుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న వీరిద్దరూ ప్రేమలో పడి 2018 వ సంవత్సరంలో కుటుంబ సభ్యుల సమక్షంలో ఇటలీలో వివాహం చేసుకున్నారు.

ఇలా పెళ్లి తర్వాత వీరిద్దరూ పూర్తిస్థాయిలో సినిమాలపై ఫోకస్ పెట్టి వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.

"""/" / ఇలా పెళ్లి జరిగి సుమారు 6 సంవత్సరాల అవుతున్న తరుణంలో ఈ జంట తల్లిదండ్రులుగా ప్రమోట్ అయ్యారు.

ఈ ఏడాది మొదట్లో దీపికా పదుకొనే తన ప్రెగ్నెన్సీ విషయాన్ని తెలియజేస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు.

ఇక ఈమె తరచు తన ప్రెగ్నెన్సీకి సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకునేవారు.

సెప్టెంబర్ 8వ తేదీ ఈ జంట పండంటి ఆడబిడ్డకు( Baby Girl ) జన్మనిచ్చారు.

ఇలా కూతురు పుట్టినప్పటికీ తన కూతురు ఎలా ఉంటుందనే విషయాన్ని మాత్రం ఈమె రివీల్ చేయలేదు.

"""/" / ఇకపోతే తాజాగా దీపావళి పండుగను పురస్కరించుకొని ఈమె తన కుమార్తె ఫోటోలను షేర్ చేశారు కానీ తన ఫేస్ మాత్రం చూపించలేదు అలాగే తన కుమార్తె పేరును కూడా ఈ సందర్భంగా తెలియజేశారు.

తన కుమార్తెకు దీపికా పదుకొనే దువా పదుకొణె సింగ్‌( Dua Padukone Singh ) అని నామకరణం చేసినట్లు వెల్లడించారు.

దువా అంటే ప్రార్థన.మా ప్రేయర్స్‌కు సమాధానమే ఈమె అని తెలియజేస్తూ తన కూతురు పాదాల ఫోటోలను షేర్ చేయడంతో ఎంతోమంది సినీ సెలబ్రిటీలు సైతం ఈ ఫోటో పై స్పందిస్తూ ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

ఇక నేటిజన్స్ కూడా తన కుమార్తె పేరు చాలా బాగుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు.