స్త్రీ, పురుషులు అనే తేడా లేకుండా చాలా మందిని కామన్‌గా ఇరిటేట్ చేసే సమస్య చుండ్రు.కానీ, ఒక్కోసారి ఎన్ని షాంపూలు మార్చినా, ఎన్ని ఆయిల్స్ వాడినా చుండ్రు పోనే పోదు.
దాంతో ఈ సమస్యను ఎలా వదిలించుకోవాలో తెలియక నానా తిప్పలు పడుతుంటారు.అయితే చుండ్రును సమర్థవంతంగా నివారించడంలో వేప నూనె అద్భుతంగా సహాయపడుతుంది.
మరి వేప నూనెను కేశాలకు ఎలా యూజ్ చేయాలి? అన్నది ఆలస్యం చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో మూడు స్పూన్ల వేప నూనె, రెండు స్పూన్ల మెంతి పొడి మరియు కొద్దిగా నిమ్మ రసం తీసుకుని మిక్స్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని తలకు అప్లై చేసి తలకు, జుట్టుకు బాగా అప్లై చేసుకోవాలి.గంట పాటు డ్రై అవ్వనిచ్చి ఆ తర్వాత గోరు వెచ్చని నీటితో తల స్నానం చేసేయాలి.
ఇలా వారంలో రెండు సార్లు చేస్తే.చుండ్రు సమస్య క్రమంగా పరార్ అవుతుంది.

అలాగే ఒక బౌల్లో రెండు స్పూన్ల వేప నూనె మరియు రెండు స్పూన్ల ఆలివ్ ఆయిల్ తీసుకుని బాగా కలుపుకోవాలి.ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని తలకు, కేశాలకు పట్టించి కాసేపు డ్రై అవ్వనివ్వాలి.అనంతరం కెమికల్స్ తక్కువగా ఉండే షాంపూ యూజ్ చేసి తల స్నానం చేయాలి.ఇలా చేసినా కూడా చుండ్రు క్రమంగా తగ్గు ముఖం పడుతుంది.
ఇక ఒక గిన్నెలో వేప నూనె మరియు ఎగ్ వైట్ రెండూ తీసుకుని మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని తలకు, జుట్టుకు పట్టించి.
ముప్పై, నలబై నిమిషాల పాటు వదిలేయాలి.ఆ తర్వాత సాధారణ షాంపూతో హెడ్ బాత్ చేసేయాలి.
ఇలా వారంలో రెండు సార్లు చేస్తే.చుండ్రు మాటుమాయం అవుతుంది.