కూర్చొని ఉండి వేగం గా పైకి లేచినప్పుడు తల తిరిగినట్లు, మైకం వచ్చినట్లు అనిపిస్తుంది.ఈ సంకేతాలు బ్లడ్ ప్రెషర్( Blood pressure ) కి కారణం అవుతుందని నిపుణులు చెబుతున్నారు.
దమనుల ద్వారా రక్తప్రసరణ శక్తి తగ్గినప్పుడు ఈ పరిస్థితి ఏర్పడుతుంది.ఆహారపు అలవాట్లు, డిహైడ్రేషన్, ఇన్ఫెక్షన్, బ్లడ్ లాస్, గుండె సమస్యలు ( Heart problems )వల్ల లో బిపి రావచ్చు.
లో బిపి అంటే ఎలా ఉంటుంది? దాని సంకేతాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.బ్లడ్ ప్రెజర్ రీడింగ్ 90/60 mm Hg కంటే తక్కువ గా ఉంటే లో బిపి అని భావించవచ్చు.
హై బీపీ వల్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేనప్పటికీ హైపోటెన్షన్ కూడా తీవ్ర లక్షణాలకు దారితీస్తుంది.

లో బిపి కి ఈ సంకేతాలు కనిపిస్తాయి.రక్త ప్రసరణ తగ్గడం వల్ల లోబీపీతో చర్మం చల్లగా,తేమగా ఉంటుంది.చర్మం లేతగా కనిపించవచ్చు.
తీవ్రమైన సందర్భాలలో లోబీపీ వల్ల మూర్చ కూడా వస్తుంది.మెదడుకు తగినంత రక్తం అందనప్పుడు ఇలా జరుగుతుంది.
తాత్కాలికంగా స్పృహ కోల్పోయేలా చేస్తుంది.ముఖ్యంగా డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మూర్చ పోవడం ప్రమాదకరం అని నిపుణులు చెబుతున్నారు.
ఇంకా చెప్పాలంటే కండరాలు, అవయవాలకు రక్తప్రసరణ తగ్గడం వల్ల కూడా లో బిపి అలసట, బలహీనత( Weakness ) ను కలిగిస్తుంది.శక్తి లేకపోవడం రోజు వారి కార్యకలాపాలను నిర్వహించడంలో ఇబ్బందులు తలెత్తుతాయి.

ఇంకా చెప్పాలంటే నిల్చున్నప్పుడు తల తిరగడం లేదా మైకంగా అనిపించడం లో బీపీకి సాధారణ సంకేతం అని నిపుణులు చెబుతున్నారు.తర్వాత మెదడుకు తగినంత రక్తాన్ని అందన్నప్పుడు ఈ లక్షణాలు కనిపిస్తాయి.ఇది తాత్కాలిక బలహీనతకు దారి తీస్తుంది.అలాగే లో బీపీ వల్ల గుండె, మెదడు వంటి ముఖ్యమైన అవయవాలకు తగినంత రక్తం సరఫరా అవ్వదు.ఇలా దీర్ఘకాలం కొనసాగితే అవయవ నష్టం జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిది.