వెంకీ అట్లూరి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్( Dulquer Salmaan ) హీరోగా నటించిన తాజా చిత్రం లక్కీ భాస్కర్.( Lucky Bhaskar ) ఇటీవల ఈ సినిమా విడుదలైన విషయం తెలిసిందే.
ఈ సినిమాలో బ్యాంకులో పని చేస్తూ తెలివిగా బ్యాంకు డబ్బును అవసరాలకు ఎలా వాడుకున్నాడు అన్న విధానాన్ని చూపిస్తూ తెరకెక్కించారు.కానీ లక్కీ భాస్కర్ డబ్బులను కాజీయలేదు.
కేవలం బ్యాంకు డబ్బులను వేరే వాళ్ళు వాడుకున్నందుకు సహకరించి డబ్బులు సంపాదించుకున్నాడు.అయితే ఇదంతా ఇప్పుడు ఎందుకు అనుకుంటున్నారా, ఇలాంటి కొందరు లక్కీ భాస్కర్లు మన టాలీవుడ్ ఇండస్ట్రీలో( Tollywood ) ఉన్నారట.
పనిచేస్తున్న సంస్థల డబ్బులే కాజేస్తున్నారట.
టాలీవుడ్ లో ఇలాంటి సంస్థ.ఆ సంస్థ ప్రస్తుతం రెండవ సినిమా తీస్తోందట.అయితే సినిమా ఇండస్ట్రీకి చెందిన ఒక సెలబ్రిటీ రికమండేషన్ ద్వారా ఒకరిని దగ్గరకు తీసి ఉద్యోగం ఇచ్చారట.
అది ఇప్పుడు మూడు నాలుగు కోట్ల వరకు తేడా చేసినట్లు తెలుస్తోంది.అయితే సదరు వ్యక్తి, అకౌంటెంట్ కలిసిపోయి ఈ దందా నడించారని తెలుస్తోంది.తీరా బయటకు వచ్చేసరికి తప్పు తనది కాదు అకౌంటెంట్ దే అని అంటున్నట్లు తెలుస్తోంది.అసలే మొదటి సినిమా భాగస్వామ్యంలో తీసి, హమ్మయ్య గట్టెక్కాం అనుకున్నారు.
రెండో సినిమా తీస్తూ, ఫండ్స్ కోసం కిందా మీదా అవుతున్నారు.ఇలా ఇబ్బంది పడుతున్న నిర్మాతపై( Producer ) ఈ భారం మరింత తలనొప్పి తెచ్చే విధంగా మారింది.
ఇదే కాకుండా ఇంకొక బడా సంస్థ కూడా ఉందట.ఆ సంస్థ తరచూ ఒక కంపెనీకి చెక్కులు ఇస్తూ వస్తుందట.అక్కడ పని చేసే ఆసామీ ఇది కనిపెట్టి, ఒక డూప్లీకేట్ అక్కౌంట్ ను ఓపెన్ చేసి, ఈ కంపెనీకి వెళ్లాల్సిన పేమెంట్లు, ఆ డూప్లికేట్ కంపెనీకి వెళ్లేలా చేసాడట.ఇది గమనించుకునేసరికి ఈ డూప్లికేట్ కంపెనీకి రెండు కోట్లకు పైగా పేమెంట్లు వెళ్లిపోయాయి.
అయితే కంపెనీ ఓనర్ గట్టివాడు కనుక, పట్టుకుని, వెనక్కు రాబట్టుకునే పనిలో వున్నారట.