షుగర్ పేషెంట్స్ ఇవి తినడం వల్ల ఎన్ని లాభాలో...!?

మీ అందరికి ముల్లంగి తెలిసే ఉంటుంది.అది మనకు మార్కెట్లో చలికాలంలోనే దొరుకుతుంది.

 So Many Benefits For Sugar Patients By These Food Raddish , Raddish, Health Care-TeluguStop.com

అంటే ముల్లంగి సీజన్ లో దొరికుతుందన్నమాట.ఇలా సీజన్లో దొరికే కొన్ని రకాల కూరగాయలు,పండ్లు తినడం వలన ఇమ్యూనిటీ సిస్టం మెరుగు పడుతుంది.

అలాగే సీజనల్ గా దొరికే ముల్లంగిని రోజువారీ ఆహారంలో భాగంగా తినడం వలన చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.ముల్లంగి కేవలం ఆరోగ్యానికి మాత్రమే కాదు చర్మానికి కూడా ఇది ఎంత గానో మేలు చేస్తుంది.

మరి ముల్లంగి తినడం వలన కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం.ఈ కాలంలో ఎక్కువగా దగ్గు, జలుబు వంటి అనారోగ్యాలతో బాధ పడుతూ ఉంటారు.

దగ్గు, జలుబు వలన రాత్రి పూట సరిగా నిద్ర పట్టదు.అలాంటప్పుడు మీరు మీ డైట్ లో ముల్లంగి చేరిస్తే మంచి ఫలితం ఉంటుంది.

ముల్లంగిని తీసుకోవడం వలన చర్మం కూడా నిగనిగలాడుతూ ఉంటుంది.ముల్లంగి లో యాంటీ హైపర్టెన్షన్ ప్రాపర్టీస్ ఉంటాయి.

కావున అధిక రక్తపోటు తో బాధ పడే వారికి ముల్లంగి మంచి మందు.అలాగే ముల్లంగి లో విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ ఈ, బి6 , పొటాషియం ఇతర మినరల్స్ కూడా ఉన్నాయి.

అలాగే ముల్లంగి తినడం వలన శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.దీనిలో యాంటీ ఆక్సిడెంట్స్ మరియు ఇతర పోషకాలు కూడా అధికంగా ఉంటాయి.

Telugu Hyper, Carbohydrates, Benefits, Care, Tips, Raddish, Sugar-Latest News -

అలాగే ముల్లంగి లో కార్బొహైడ్రేట్లు తక్కువగా ఉంటాయి కాబట్టి షుగర్ పేషెంట్లకు ఇది ఒక ఔషధం అనే చెప్పాలి.ముల్లంగి తినడం వలన షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో ఉంటాయి.అంతే కాదండి ముల్లంగి లో పోలిక్ యాసిడ్, విటమిన్ సి, కాల్షియం, పొటాషియం సమృద్ధిగా ఉంటాయి.కాబట్టి ముల్లంగిని మీకు నచ్చిన వంటకాల్లో వేసి వండుకోవచ్చు.ముల్లంగి తో కూర, పచ్చడి, సాంబార్ ఇలా నచ్చిన వంటల్లో మనం వేసుకోవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube