ఈ రోజు పంచాంగం ( Today’s Telugu Panchangam):
సూర్యోదయం: ఉదయం 6.07
సూర్యాస్తమయం: సాయంత్రం.6.31
రాహుకాలం: సా.4.30 ల6.00
అమృత ఘడియలు: నవమి మంచిది కాదు
దుర్ముహూర్తం: సా.4.25 ల5.13
మేషం:

ఈరోజు స్ధిరాస్తి సంబంధిత నూతన ఒప్పందాలు వాయిదా పడతాయి.వ్యాపార వ్యవహారాలు నిరుత్సాహం కలిగిస్తాయి.పనులలో శ్రమ తప్ప ఫలితం కనిపించదు.
ఉద్యోగాలలో ఇతరుల నుండి ఊహించని సమస్యలు ఎదుర్కొంటారు.ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.ప్రయాణాలు అంతగా కలిసి రావు.
వృషభం:

ఈరోజు కుటుంబ సభ్యుల నుండి శుభవార్తలు అందుతాయి.ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది.నూతన వ్యక్తుల పరిచయాల కొంత ఉత్సాహం కలిగిస్తాయి.
విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు.వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు.
మిథునం:

ఈరోజు బంధు మిత్రుల నుండి ఊహించని మాటలు వినవలసివస్తుంది.చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది.కుటుంబ బాధ్యతలు పెరిగి ఒత్తిడి అధికమవుతుంది.
వ్యాపార ఉద్యోగాలు సమస్యాత్మకంగా ఉంటాయి.అనుకున్న సమయానికి ధనం అందక ఇబ్బంది పడతారు.
కర్కాటకం:

ఈరోజు సంఘంలో పెద్దలతో చర్చలు లాభసాటిగా ఉంటాయి.వివాదాలకు సంబంధించిన కీలక సమాచారం అందుతుంది.నూతన ప్రయత్నాలు అనుకూల ఫలితాన్ని ఇస్తాయి.వృత్తి వ్యాపారాలలో ఒడిదుడుకులు అధిగమిస్తారు.ఋణ సంబంధిత ఇబ్బందుల నుంచి బయట పడతారు.
సింహం:

ఈరోజు ధన పరంగా ఇబ్బందులను అధిగమించి ముందుకు సాగుతారు.బంధు మిత్రుల నుండి శుభవార్తలు అందుతాయి.చిన్ననాటి మిత్రులతో దూర ప్రయాణాలు చేస్తారు.
వ్యాపారాల విస్తరణకు అవరోధాలు తొలగుతాయి.నిరుద్యోగులకు అనుకూల వాతావరణం ఉంటుంది.విద్యార్థులు కష్టం ఫలిస్తుంది.
కన్య:

ఈరోజు ఊహించని ప్రయాణాలు చేయవలసి వస్తుంది.వృత్తి వ్యాపారాలలో అకస్మాత్తుగా మార్పులు చోటు చేసుకుంటాయి.ఋణ ఒత్తిడులు పెరుగుతాయి.
ఉద్యోగస్తులకు పని భారం పెరుగుతుంది.కుటుంబ సభ్యులతో స్వల్ప వివాదాలు ఉంటాయి.శిరోబాధలు పెరుగుతాయి.
తుల:

ఈరోజు వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి.ఉద్యోగమున ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి.చేపట్టిన పనులలో స్వల్ప ఆటంకాలు ఉంటాయి.
సోదరులతో మాటపట్టింపులు కలుగుతాయి.ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి.వాహన ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండాలి.
వృశ్చికం:

ఈరోజు సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు.సన్నిహితులతో సఖ్యతగా వ్యవహరిస్తారు.
వ్యాపారాల్లో అభివృద్ధి బాటలో పయనిస్థాయి.దైవదర్శనం చేసుకుంటారు.ఉద్యోగమున ఉన్నతి కలుగుతుంది.
ధనుస్సు:

ఈరోజు ఆర్థికంగా మరింత పురోగతి సాధిస్తారు.మిత్రుల నుండి ఆశ్చర్యకర విషయాలు తెలుస్తాయి.దూరప్రాంతాల వారి నుండి శుభవార్తలు అందుతాయి.
విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు.వ్యాపార ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది.ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది.
మకరం:

ఈరోజు దూరపు బంధువులతో మాటపట్టింపులు కలుగుతాయి.సంతాన ఆరోగ్య విషయంలో కొంత అప్రమత్తంగా వ్యవహరించాలి.ముఖ్యమైన వ్యవహారాలలో వ్యయ ప్రయాసలు అధికమవుతాయి.
వ్యాపార ఉద్యోగాలలో మరింత ఒత్తిడి పెరుగుతుంది.ఊహించని ఖర్చులు పెరుగుతాయి.
కుంభం:

ఈరోజు వృధా ప్రయాణాలు చేయవలసి రావచ్చు.ఇంటా బయట చికాకులు మరింత పెరుగుతాయి.ముఖ్యమైన కార్యక్రమాలను వాయిదా వేయడం మంచిది.ఆరోగ్యం సహకరించక ఇబ్బంది కలిగిస్తుంది.వృత్తి వ్యాపారాలు మందగిస్తాయి.ఉద్యోగులకు అదనపు వివరాలు పనిభారం తప్పదు.
మీనం:

ఈరోజు సన్నిహితులతో గృహమున ఆనందంగా గడుపుతారు.సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది.నూతన కార్యక్రమాలను చేపట్టి లాభం పొందుతారు.ఆకస్మిక ధన లాభం కలుగుతుంది.వృత్తి వ్యాపారాలు ఆశించిన రీతిలో రాణిస్తాయి.నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి.