వర్షాకాలంలో ఏసీలను ఉపయోగిస్తూ ఉన్నారా.. అయితే ఈ విషయాలు మీకోసమే..!

ప్రస్తుత సమాజంలో చలిగా ఉన్న ఎండగా ఉన్న చాలామంది ప్రజలు ఏసీ ని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.ఎందుకంటే ప్రస్తుతం వర్షాకాలం( Rainy season ) నడుస్తూ ఉంది.

 Are You Using Acs In Monsoons But These Things Are For You, Acs , Health , Heal-TeluguStop.com

ఈ సీజన్ లో వేడితో పాటు శరీరంపై జిగురుగా కూడా ఉంటుంది.ముఖ్యంగా చెప్పాలంటే వర్షాకాలంలో శరీరం పై ఉన్న చెమట సులభంగా ఆరిపోదు.

అలాగే అనేక చర్మవ్యాధుల ప్రమాదం కూడా పెరుగుతుంది.వర్షాకాలంలో వాతావరణంలో తేమ ఎక్కువగా ఉంటుంది.

మీరు కూడా తేమతో ఇబ్బంది పడుతున్నట్లయితే మీరు ఫ్యాన్లు మరియు కూలర్ల నుంచి ఉపశమనం పొందలేరు.ఇలాంటి పరిస్థితిలో చాలామంది ఎక్కువగా ఏసీలను ఉపయోగిస్తున్నారు.

Telugu Coolers, Fungal, Tips, Rainy Season-Latest News - Telugu

వర్షాకాలంలో ఏసీ ఉష్ణోగ్రత ఎలా ఉండాలి.ఏసీ ఎప్పుడూ ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది అనే ప్రశ్న చాలా మందిలో ఉంటుంది.ఈ ప్రశ్నలను వర్షాకాలంలో ఏసీ ని ఉపయోగించడం మంచిదో కాదో ఇప్పుడు తెలుసుకుందాం.వర్షాకాలంలో తేమ ఎక్కువగా ఉంటే ఏసిని ఉపయోగించవచ్చు.తేమ ఎక్కువగా ఉంటే మీరు ఏసి నీ డ్రై మోడ్‌ ను ఉపయోగించవచ్చు.కానీ ఎక్కువసేపు దీన్ని ఉపయోగించకూడదు.

సాధారణంగా ఏసీ యొక్క ఉష్ణోగ్రత 24 నుంచి 26 డిగ్రీల మధ్య ఉండడం మంచిది.రాత్రి సమయంలో ఏసీ ని ఉపయోగించవచ్చు.

అయితే ఏసీ యొక్క అధిక వినియోగం కూడా హానికరం అనీ నిపుణులు చెబుతున్నారు.

Telugu Coolers, Fungal, Tips, Rainy Season-Latest News - Telugu

ఏసీ నీ ఉపయోగించడం వల్ల చర్మంలోని తేమ దూరం అవడంతో పాటు పొడిబారిన చర్మం చర్మ సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది.అటువంటి పరిస్థితుల్లో ఏసిని జాగ్రత్తగా ఉపయోగించాలి.తక్కువ ఉష్ణోగ్రత వద్ద ఏసీ ని ఉపయోగించడం వల్ల జలుబు, ఫ్లూ ( Cold )లాంటి సమస్యలు వస్తాయని వైద్యులు చెబుతున్నారు.

చాలామంది వర్షాకాలంలో తడిసిపోయి వచ్చి ఏసి ఆన్ చేసి ఆరబెట్టడం లాంటి పనులు చేస్తూ ఉంటారు.ఇలా చెయ్యడం చాలా ప్రమాదకరం అని కూడా చెబుతున్నారు.వర్షంలో తడిసిన తర్వాత ఎల్లప్పుడూ శుభ్రమైన నీటితో స్నానం చేయాలి.అంతేకాకుండా వర్షంలో చెమట మరియు ధూళి కారణంగా చర్మంపై ఫంగల్ ఇన్ఫెక్షన్( Fungal Infections ) కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది.

అలాగే వర్షంలో ఆరోగ్యకరమైన ఆహారం తినడం మరియు త్రాగడంలో పరిశుభ్రతను పాటించాలి.ఈ సీజన్ లో ఎక్కువ రోగాలు వ్యాప్తి చెందే అవకాశం ఉంది.

కాబట్టి ఎంతో జాగ్రత్తగా ఉండడం మంచిది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube