1.కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల ఇళ్లలో సోదాలు
ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా 30 చోట్ల ఏకకాలంలో ఐటి, ఈడి అధికారులు సాదాలు నిర్వహించారు. ముఖ్యంగా కాంగ్రెస్ , బీఆర్ఎస్ నేతలతో పాటు, ప్రముఖ వ్యాపారుల లావాదేవీలు పైన ఐటి, ఈడి అధికారులు విచారణ చేపట్టారు.
2.పవన్ కళ్యాణ్ విమర్శలు

మత్స్యకారుల సంక్షేమం ఉపాధి కల్పన పై వైసీపీ ప్రభుత్వానికి చిత్తు శుద్ది ఏది అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు.
3.వివేక్ ఇంట్లో ముగిసిన ఈడి , ఐటి సోదాలు
చెన్నూరు అసెంబ్లీ కాంగ్రెస్ అభ్యర్థి మాజీ ఎంపీ వివేక్ ఇంట్లో ఐటి ఈడి అధికారుల సోదాలు ముగిసాయి.
4.సీతక్క విమర్శలు

నన్ను ఓడించేందుకు బీఆర్ఎస్ పెద్దలు అనేక కుట్రలు చేస్తున్నారని ములుగు ఎమ్మెల్యే సీతక్క విమర్శించారు. ఈవీఏం లలో తన ఫోటో గుర్తు తగ్గించారని ఆమె మండిపడ్డారు.
5.కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలవనున్న టిడిపి
ఈరోజు సాయంత్రం 6 గంటలకు ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల సంఘాన్ని టిడిపి బృందం కలవనుంది. రాష్ట్రంలో దొంగ ఓట్లు , చేర్పులు , తొలగింపులు పై ఫిర్యాదు చేయనున్నారు.
6.జగన్ నెల్లూరు పర్యటన రద్దు

ఏపీ సీఎం జగన్ నెల్లూరు పర్యటన ఆకస్మికంగా రద్దయింది.తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో హెలికాప్టర్ ప్రయాణానికి ఇబ్బందులు కారణంగా జగన్ తన పర్యటనను రద్దు చేసుకున్నారు.
7.చంద్రబాబు బెయిల్ పై సుప్రీంకోర్టుకు సిఐడి
స్కిల్ డెవలప్మెంట్ కేసులో టిడిపి అధినేత చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ హైకోర్టు మంజూరు చేసిన నేపథ్యంలో దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్లాలని సిఐడి నిర్ణయించుకుంది.
8.నేడు 9 జిల్లాలకు భారీ వర్ష సూచన

తమిళనాడులోని తొమ్మిది జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది.
9.తుమ్మల నాగేశ్వరావు కామెంట్స్
టిఆర్ఎస్ ప్రభుత్వం దేవుడికి ఇచ్చిన మాట తప్పిందని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విమర్శించారు.సాక్షాత్తు శ్రీరాముడు కొలువైన ఆలయం అభివృద్ధి పనులు వాగ్దానం అమలు కాలేదని బీఆర్ఎస్ ప్రభుత్వం పై తుమ్మల మండిపడ్డారు.
10.నేడు నాలుగు నియోజకవర్గాల్లో రేవంత్ ప్రచారం

తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఈరోజు నాలుగు నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు .వనపర్తి, నాగర్ కర్నూల్ , అచ్చంపేట , జూబ్లీహిల్స్ నియోజకవర్గల్లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు.
11.శబరిమలకు ప్రత్యేక రైళ్లు
శబరిమల ఆలయం తెరుచుకున్న నేపథ్యంలో ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు.ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా భారీగా భక్తులు తరలివస్తున్న నేపథ్యంలో 22 ప్రత్యేక రైలు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.
12.తెలంగాణ వ్యాప్తంగా 49 కౌంటింగ్ కేంద్రాలు

ఈనెల 30న జరగనున్న తెలంగాణ శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపు కేంద్రాలను ఖరారు చేశారు.రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 33 జిల్లాల 49 ఓట్ల లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.
13.తెలంగాణ పర్యటనకు రాహుల్ ప్రియాంక
మరోసారి తెలంగాణ పర్యటనకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక రాహుల్ గాంధీ రానున్నారు.ఈనెల 24 , 25 తేదీల్లో వారు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.
14.9 నేషనల్ లోక్ అదాలత్

డిసెంబర్ 9న నిర్వహించే నేషనల్ లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలని వికారాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి సుదర్శన్ సూచించారు.
15.త్రిష కు అండగా ఉంటా చిరంజీవి
కోలీవుడ్ సీనియర్ ఆర్టిస్ట్ మన్సూర్ అలీ ఖాన్ త్రిషపై చేసిన మెగాస్టార్ చిరంజీవి మండిపడ్డారు.త్రిష కు తాను అండగా నిలబడతానని చిరంజీవి అన్నారు.
16.ఏపీలో భారీ వర్షాలు

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఏపీలోని అనేక ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా, మరికొన్ని ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి.
17.చంద్రబాబు బెయిల్ పై ఏపీ ప్రభుత్వం అభ్యంతరం
ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులు టిడిపి అధినేత చంద్రబాబుకు హైకోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన నేపథ్యంలో, ఏపీ ప్రభుత్వ వర్గాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి .బెయిల్ ఉత్తర్వుల్లో పేర్కొన్న పలు అంశాలు పై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.
18.మెదక్ లో విజయశాంతి ప్రచారం

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఏడు రోజులు సమయం ఉండడంతో ఇటీవల కాంగ్రెస్ లో చేరిన ఆ పార్టీ క్యాంపెయిన్ కమిటీ చీఫ్ కోఆర్డినేటర్ విజయశాంతి మెదక్ కాంగ్రెస్ అభ్యర్థి రోహిత్ కి మద్దతుగా విజయశాంతి రోడ్ షో లో పాల్గొననున్నారు.
19.కేటీఆర్ ఎన్నికల ప్రచారం
నేడు మెదక్, సిరిసిల్ల, హైదరాబాద్ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు.దుబ్బాక , జహీరాబాద్ , ముస్తాబాద్ లో సభలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ సనత్ నగర్ లో నిర్వహించనున్నారు.
20.కెసిఆర్ ఎన్నికల ప్రచారం

బీఆర్ఎస్ అధినేత తెలంగాణ సీఎం కేసీఆర్ ఈరోజు నాలుగు నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు.మధిర, వైరా, డోర్నకల్ , సూర్యాపేటలో ప్రజా ఆశీర్వాద సభలో కెసిఆర్ పాల్గొంటారు.