వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్( Nithin ) హీరోగా నటించిన తాజా చిత్రం రాబిన్ హుడ్.( Robinhood ) ఈ సినిమాలో శ్రీ లీలా( Sreeleela ) హీరోయిన్గా నటించిన విషయం తెలిసిందే.
ఇప్పటికే గతంలో వెంకీ కుడుములా నితిన్ కాంబినేషన్లో భీష్మ సినిమా విడుదల అయ్యి మంచి సక్సెస్ ను సాధించిన విషయం తెలిసిందే.బీష్మ మంచి విజయం సాధించడంతో ఈ సినిమాపై కూడా అదే రేంజ్ లో అంచనాలు నెలకొన్నాయి.ఇకపోతే భీష్మ సినిమా ఎలా ఉంది ప్రేక్షకులను మెప్పించిందా లేదా? అసలు కథ ఏమిటి అన్న వివరాల్లోకి వెళితే.
కథ:
రామ్ (నితిన్) ఒక అనాథ.దాంతో శుభలేఖ సుధాకర్ నడిపే ఒక అనాధ ఆశ్రమంలోనే పెరుగుతూ ఉంటాడు.అయితే రామ్ పెరిగిన అనాథ ఆశ్రమానికి విరాళాలు లేక పిల్లలు తిండికి లేక ఇబ్బంది పడుతూ ఉంటారు.
అలాంటి సమయంలో రామ్ దొంగతనాలు చేయడం మొదలు పెడతాడు.పెద్దలను కొట్టు పేదోళ్లకు పెట్టు అనే సిద్ధాంతం నీ వంట పట్టించుకొని రాబిన్ హుడ్ అనే నిక్ నేమ్ తో పెద్దపెద్ద దొంగతనాలు చేస్తూ ఉంటాడు.
ఆ దొంగతనాలను ట్రేస్ చేసి రాబిన్ హుడ్ ను అరెస్ట్ చేసేందుకు విక్టర్ (షైన్ చాం టాకో) రంగంలోకి దిగుతాడు.

దీంతో దొంగతనాలు కరెక్ట్ కాదని జనార్ధన్ సున్నిపెంట అలియాస్ జాన్ స్నో(రాజేందర్ ప్రసాద్)( Rajendra Prasad ) నడిపే ఒక సెక్యూరిటీ ఏజెన్సీలో జాయిన్ అవుతాడు.జాయిన్ అయిన రోజే ఆస్ట్రేలియాలో సెటిల్ అయిన ఇండియన్ ఫార్మా కంపెనీ అధినేత కుమార్తె నీరా వాసుదేవ్ (శ్రీ లీల) వచ్చే ఒక ట్రిప్ కోసం కాంట్రాక్ట్ తీసుకుంటారు.ఇండియాస్ నెంబర్ వన్ సెక్యూరిటీ ఏజెన్సీ అని నమ్మించి ఆమెను రుద్రకొండ అనే ఏజెన్సీ ప్రాంతానికి తీసుకు వెళ్తారు.
అలా వెళ్లిన తర్వాత అక్కడ సామి (దేవదత్తా నాగే) వలలో చిక్కుకుంటారు.వారి బారి నుంచి నీరాను రాబిన్ హుడ్ అండ్ టీం తప్పించిందా? అసలు నీరాను రుద్రకొండ ఎందుకు రప్పించారు? చివరికి ఏమైంది? హీరో హీరోయిన్ మధ్య ప్రేమ ఎలా మొదలైంది ఈ వివరాలు అన్నీ తెలియాలి అంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ:
ఈ సినిమా తరహాలో గతంలో చాలా సినిమాలు వచ్చాయి.ఫస్ట్ హాఫ్ సినిమా మొదలైన కొద్దిసేపటి వరకు సినిమా టైటిల్ అయిన రాబిన్ హుడ్ కి జస్టిఫికేషన్ ఇచ్చేలా హీరో ఎందుకు దొంగగా మారాడు అనే విషయాన్ని చూపించారు.నీరా వాసుదేవ్ ఎంట్రీ తరువాత కామెడీ తరహా సన్నివేశాలు ఎక్కువగా ఉంటాయి.ముఖ్యంగా రాజేంద్రప్రసాద్ నితిన్ వెన్నెల కిషోర్ మధ్య కామెడీ సీన్స్ హైలైట్ గా నిలుస్తాయని చెప్పాలి.
ఈ ముగ్గురి కాంబినేషన్లో వచ్చిన సన్నీ వేషాల్లో కడుపుబ్బా నవ్వుకోవచ్చు.అయితే సినిమాలో నెక్స్ట్ ఏం జరుగుతుంది అన్న విషయాన్ని ముందుగానే పసిగట్టగలం ప్రేక్షకులు అనుకునే లోపే మళ్ళీ ట్విష్టుల మీద ట్విస్టులు ఉండేలా రాసుకున్నారు డైరెక్టర్ వెంకీ.
అలాగే సెకండ్ ఆఫ్ లో వచ్చే కొన్ని సీన్స్ ప్రేక్షకుల అంచనాలను అందుకోకుండా రాసుకోవడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు.రొటీన్ కథ అయినా కామెడీతో బండి నడిపించాలని ప్రయత్నించిన దర్శకుడు వెంకి కుడుముల సక్సెస్ అయ్యాడనే చెప్పాలి.

నటీనటుల పనితీరు:
నితిన్ ఎప్పటిలాగే తన యాక్టింగ్ తో ప్రేక్షకులను మెప్పించడం మాత్రమే కాకుండా తన కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించారు.ఇక సెకండ్ హాఫ్ లో పలు సీన్స్ లో బాగా ఆకట్టుకున్నారు నితిన్.శ్రీ లీలా తన అందాలను ఆరబోస్తూనే కొన్ని సీన్లలో బాగా నటించి మెప్పించింది.దేవ దత్త పాత్ర భయపెడుతూనే చివరిలో కాస్త డల్ చేసింది.అలాంటి పవర్ఫుల్ విలన్ ను ఇంకా ఏదైనా చేస్తారేమో అని ఎక్స్పెక్ట్ చేసిన ప్రేక్షకులను నిరాశ పరుస్తూ జైలు పాలు చేయడం గమనార్హం.అయితే డేవిడ్ వార్నర్( David Warner ) కనిపించింది చాలా తక్కువ సేపు అయినా సరే ఆయనను చూడగానే థియేటర్స్ లో విజిల్స్ పడేలా స్క్రీన్ ప్రజన్స్ ఉంది.
ఇక మిగిలిన నటీనటులు కూడా ఎవరి పాత్రల పరిధి మేరకు వారు బాగానే నటించారు.

టెక్నికల్ పనితీరు :
ఇక సంగీత దర్శకుడు జీవి ప్రకాష్ కుమార్ ఇచ్చిన సాంగ్స్ సినిమాని ప్రేక్షకుల్లోకి బాగా తీసుకువెళ్లాయి.అలాగే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో కూడా ఎక్కడా తగ్గలేదని చెప్పాలి.సినిమాటోగ్రఫీ కూడా సినిమాని నెక్స్ట్ లెవెల్ కి తీసుకు వెళ్ళింది.
అదిదా సర్ప్రైజ్ సాంగ్ లోని స్టెప్స్ కూడా చాలా బాగున్నాయి.అలాగే యాక్షన్ సీక్వెన్స్ లు స్టైలిష్ గా ఉన్నాయి.డైలాగ్స్ ట్రెండీగా ఉంటూ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయి.