హెయిర్ ఫాల్( Hairfall ) అనేది చాలా మందిని కలవరపెట్టే సమస్య.కొందరిలో హెయిర్ ఫాల్ తక్కువగా ఉంటే.
మరికొందరిలో చాలా ఎక్కువగా ఉంటుంది.ఈ క్రమంలోనే జుట్టు రాలడాన్ని అడ్డుకునేందుకు తెగ ప్రయత్నిస్తూ ఉంటారు.
అయితే అలాంటి వారికి తులసి( Tulsi ) చాలా ఉపయోగకరంగా ఉంటుంది.జుట్టు రాలడాన్ని అరికట్టడంలో తులసి ఉత్తమంగా సహాయపడుతుంది.
మరి తులసి ఆకులను జుట్టుకు ఎలా ఉపయోగించాలి.? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు మెంతులు( Fenugreek Seeds ) వేసి అర కప్పు వాటర్ పోసి నైట్ అంతా నానబెట్టుకోవాలి.మరుసటి రోజు మిక్సీ జార్ తీసుకుని అందులో చేతినిండా తులసి ఆకులు వేసుకోవాలి.
అలాగే రెండు మందారం ఆకులు,( Hibiscus ) నైట్ అంతా నానబెట్టుకున్న మెంతులు మరియు వన్ టేబుల్ స్పూన్ కోకోనట్ ఆయిల్( Coconut Oil ) వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.

గంట అనంతరం మైల్డ్ షాంపూను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.వారానికి ఒకసారి ఈ రెమెడీని కనుక పాటించారంటే చాలా బెనిఫిట్స్ పొందుతారు.ముఖ్యంగా తులసి ఆకుల్లో ఐరన్, జింక్, విటమిన్ ఎ మరియు విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి, ఇవి తలకు చక్కని పోషణ అందిస్తాయి.జుట్టు కుదుళ్లను బలోపేతం చేసి హెయిర్ ఫాల్ సమస్యకు అడ్డుకట్ట వేస్తాయి.

తులసి లో యాంటీ ఫంగల్ మరియు యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి.ఇవి తలపై ఇన్ఫెక్షన్లను నివారించడంలో, చుండ్రును తగ్గించడంలో తోడ్పడతాయి.అలాగే మెంతులు, మందారం ఆకులు, కొబ్బరి నూనె కూడా జుట్టు రాలే సమస్యకు చెక్ పెట్టడంలో సహాయం చేస్తాయి.అంతేకాకుండా ఇప్పుడు చెప్పుకున్న హెయిర్ ప్యాక్ ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.