1.భారత ప్రయాణికులకు గుడ్ న్యూస్
భారత్ తో సహా కొన్ని దేశాలకు అమెరికా గుడ్ న్యూస్ చెప్పింది.ఆ దేశాలపై ఉన్న ప్రయాణ అంశాలను సడలించింది.
2.ఆఫ్ఘన్ బాలల చదువుల పై తాలిబన్లు బ్యాన్ ! ప్రపంచ బ్యాంక్ షాక్
ఆఫ్ఘన్ బాలల చదువుల పై తాలిబన్లు బ్యాన్ విధించడం పై ప్రపంచ బ్యాంక్ షాక్ ఇచ్చింది.వివిధ రంగాల్లో అభివృద్ధికి ప్రపంచ బ్యాంక్ మంజూరు చేస్తామన్న నిధులను నిలిపివేసింది.
3.భారత్ లో రష్యా విదేశాంగ మంత్రి పర్యటన
పార్క్ లో రష్యా విదేశాంగ శాఖ మంత్రి సెర్లి రావ్ లోప్ ఈనెల 31 నుంచి ఏప్రిల్ ఒకటో తేదీ వరకు పర్యటిస్తారు.
4.ఇమ్రాన్ రాజీనామా పై పెరుగుతున్న ఒత్తిడి
పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ రాజీనామా పై ప్రతిపక్షాలు మరింతగా ఒత్తిడి ప్రారంభించాయి.ప్రతిపక్షాలు అంతా కలిసి ఉమ్మడిగా ఈ విషయంపై సమావేశం నిర్వహించాయి.
5.ఇజ్రాయిల్ లో కాల్పులు .ఐదుగురు మృతి
ఇజ్రాయిల్ లోని టెల్ అవీల్ లో జరిగిన కాల్పుల్లో ఐదుగురు మరణించారు.
6.ఆసియాలో ఉత్తమ 50 రెస్టారెంట్ లలో భారత్ కూ స్థానం
ఆసియాలో ఉత్తమ 50 రెస్టారెంట్ లలో భారత్ కూ స్థానం దక్కింది.21,22,49 వ స్థానాలు భారత్ లోని రెస్టారెంట్ లు దక్కించు కున్నాయి.
7.శ్రీలంక లో మరో సంక్షోభం
శ్రీలంక లో మరో సంక్షోభం మొదలయ్యింది.ఇప్పటికే అక్కడ ఆర్థిక సంక్షోభం తీవ్రతరం కాగా , ఇప్పుడు నిత్యం అక్కడ 10 గంటల పాటు కరెంటు కోత విధిస్తూ ఉండడంతో జనాలు అల్లాడి పోతున్నారు.
8.పుతిన్ సాయం కోరిన ట్రంప్
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సాయాన్ని అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కోరారు.జో బైడన్ కుటుంబాన్ని నష్టపరిచే ఏ సమాచారాన్ని అయినా తనకు అందించాలని కోరారు.
9.రష్యా ఉక్రెయిన్ యుద్ధం
రష్యా ఉక్రెయిన్ యుద్ధం లో ఇప్పటి వరకు 17,300 మంది రష్యన్ సైనికులు హతమయినట్టు ఉక్రెయిన్ ప్రకటించింది.
10.రష్యా దౌత్య సిబ్బంది పై బహిష్కరణ వేటు
యురోపియన్ దేశాలు గుడాచార్య ఆరోపణలపై డజన్ల కొద్దీ రష్యన్ దౌత్య కార్యాలయ సిబ్బంది పై బహిష్కరణ వేటు వేశాయి.