Remedies For Skin Tan : టాన్ ను తొలగించి కేవలం 20 నిమిషాల్లో ముఖాన్ని తెల్లగా మార్చే సూపర్ రెమెడీ మీకోసం!

సమ్మర్ సీజన్ స్టార్ట్ అవుతుంది.ఎండలు మెల్ల మెల్లగా పెరుగుతున్నాయి.

 A Super Remedy To Remove Tan And Whiten Your Face In Just 20 Minutes-TeluguStop.com

ఈ ఎండల్లో బయట తిరిగారంటే చర్మం చాలా త్వరగా టాన్( Tan ) అయిపోతుంది.ఇటువంటి చర్మం అసహ్యంగా, అందవిహీనంగా కనిపిస్తుంది.

అందుకే టాన్ అయిన చర్మాన్ని రిపేర్ చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు.మీరు ఈ జాబితాలో ఉన్నారా.? అయితే ఇప్పుడు చెప్పబోయే సూపర్ రెమెడీ( Super Remedy ) మీకు అద్భుతంగా హెల్ప్ అవుతుంది.ఈ రెమెడీ టాన్ ను తొలగించి కేవలం ఇర‌వై నిమిషాల్లోనే ముఖాన్ని తెల్లగా కాంతివంతంగా మారుస్తుంది.

మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి.ముందుగా మిక్సీ జార్‌ తీసుకుని అందులో కొన్ని పైనాపిల్ ముక్కలు వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసి జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.

Telugu Remedyremove, Tips, Skin, Latest, Skin Care, Skin Care Tips, Skin Remedy,

ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ షుగర్ పౌడర్, వన్ టేబుల్ స్పూన్ బియ్యం పిండి వేసుకావాలి.అలాగే వ‌న్ టేబుల్ స్పూన్ అలోవెరా జెల్( Aloevera Gel ), హాఫ్ టేబుల్ స్పూన్ విటమిన్ ఈ ఆయిల్, సరిపడా పైనాపిల్ జ్యూస్ వేసుకుని అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు, చేతులకు అప్లై చేసుకుని 20 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.ఆపై చర్మాన్ని సున్నితంగా స్క్రబ్బింగ్ చేసుకుంటూ వాటర్ తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.

పైనాపిల్( Pineapple ) లో విటమిన్ ఎ, సి సమృద్ధిగా ఉంటాయి.ఇవి మీ చర్మాన్ని కాంతివంతం చేయడానికి తోడ్ప‌తాయి.

టాన్‌ను స‌మ‌ర్థ‌వంతంగా తొల‌గిస్తాయి.మ‌రియు పైనాపిల్‌లో యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్‌తో పోరాడటానికి సహాయపడుతుంది.

Telugu Remedyremove, Tips, Skin, Latest, Skin Care, Skin Care Tips, Skin Remedy,

అలాగే విట‌మిన్ ఈ ఆయిల్ ఆరోగ్య‌మైన మెరిసే చ‌ర్మాన్ని అందిస్తుంది.స్కిన్ ను తేమ‌గా ఉంచుతుంది.క‌ల‌బంద‌లో ఉండే యాంటీ బాక్టీరియల్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు చర్మాన్ని చల్లబరుస్తాయి.టాన్ తొలగించడంలో సహాయపడ‌తాయి.బియ్యం పిండి( Rice Flour ), షుగర్ పౌడర్ కూడా టాన్ ను నివారిస్తాయి.చర్మాన్ని తెల్లగా కాంతివంతంగా మారుస్తాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube