మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ ను సందర్శించిన సింగ సముద్రం కనెక్టింగ్ కాలువల చైర్మన్ ఒగ్గు బాలరాజు యాదవ్

సిద్దిపేట జిల్లా కుకునూర్ పల్లి మండలంలో గల మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ ను సింగ సముద్రం కనెక్టింగ్ కాలువల చైర్మన్ ఒగ్గు బాలరాజు యాదవ్ బుదవారం పరిశీలించారు.ఇటీవల సింగ సముద్రం లో నీటి మట్టం ను పరిశీలించగా 15 ఫీట్లు వరకే నీరు నిల్వ ఉండగా ప్రస్తుతం వరి పంటలు పొట్ట దశకు ఉండగా పంటలు పూర్తి స్థాయిలో పండే అవకాశం లేదు .

 Oggu Balaraju Yadav Chairman Of Singa Samudram Connecting Canals Visited The Mal-TeluguStop.com

దీంతో ఎల్లారెడ్డి పేట, బోప్పపూర్,కోరుట్ల పేట, సర్వాయి పల్లె,నారాయణ పూర్ గ్రామాల ఆయకట్టులో వేసిన పంటలు పూర్తిగా ఎండిపోయే ప్రమాదం ఉందని సోమవారం సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కార్యాలయం లో జరిగిన ప్రజావాణిలో మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ నుండి ఎగువ మానేర్ కు అక్కడి నుండి సింగ సముద్రం కు నీటిని అందించాలని జిల్లా అదనపు కలెక్టర్ గౌతమి కి వినతి పత్రం అందజేశారు.

కాగ మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ ను ఒగ్గు బాలరాజు యాదవ్ పరిశీలించారు.

మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ లో కూడా చాలా మేరకు నీటి మట్టం తగ్గిందని పంటలు ఎలా చేతికి అందుతాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.తప్పనిసరి పరిస్థితుల్లో రైతులు బోర్ మోటార్ లను సైతం స్టార్ట్ చేసుకోవాలని ఒగ్గు బాలరాజు యాదవ్ రైతులను కోరారు.

వరుస తడులు తప్పేట్టు లేదు.సింగ సముద్రం ఆయకట్టు నుండి వచ్చే సాగు నీటి తో పంటలు పూర్తిగా పండే పరిస్థితి లేదని రైతులు వరుస తడుల ద్వారా పంటలు చేతికి అందేలా చూసుకోవాలని రైతులను కోరారు.

ఆయన వెంట జీడి రాజు యాదవ్,అందే శేఖర్,రాజు తదితరులు ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube