షాపింగ్ అంటే అందరికీ ఎంతో ఇష్టం.షాపింగ్ చేయడానికి ఇష్టపడని వారంటూ ఎవరూ ఉండరు.
దుస్తులు కొనుక్కున్నప్పటి నుంచి వాటిని వేసుకోవాలనే ఆత్రుత ఏర్పడి వెంటనే వేసుకుంటాం.అయితే ఇలా చేస్తే చాలా రోగాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా వహించండి.
కొత్త బట్టలు ధరించే ముందు వాటిని తప్పనిసరిగా ఉతకాలి.ఇలా ఎందుకు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
మనంకొత్త బట్టలు కొనుగోలు చేసినప్పుడు అవి మీకు ఎలా కనిపిస్తున్నాయో చూడటానికి ప్రయత్నిస్తాం.అయితే మీలాగే మీ కంటే ముందు మరొకరు వాటిని ధరించి ఉంటారని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? చాలామంది చెమట, దుమ్ము, కురుపులు ఉన్నప్పటికీ మాల్స్‌లోని దుస్తులను ధరించి, అవి సెట్ కాకపోతే అక్కడే పెట్టేస్తారు.
మీరు అటువంటి దుస్తులను ధరించడం వల్ల ఇన్ఫెక్షన్ల ప్రమాదం పెరుగుతుంది.ఆ దుస్తులు వేసుకోవడం వలన వ్యాధుల బారిన పడతారు.అందుకే కొత్త బట్టలు ఉతకడం చాలా అవసరం.కొత్త బట్టలు ఫ్యాక్టరీలో తయారై ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి వెళ్ళినప్పుడు, వాటిని చాలా మంది ముట్టుకుంటారు.
ఈ కారణంగా వారి చెమటతో పాటు క్రిములు ఆ దుస్తులకు అంటుకుంటాయి.బట్టలు ప్యాక్ చేసినపుడు అందులో వివిధ రకాల కెమికల్స్ కలుపుతారు.
ఫలితంగా దుస్తులను పురుగులు తినకుండా లేదా వాటి వల్ల ఎలాంటి హాని కలగకుండా ఉంటుంది.బట్టల ప్రాసెసింగ్‌లో అనేక రకాల రసాయనాలు ఉపయోగిస్తారు.

అందుకే మీరు వాటిని ఉతకకుండా ధరిస్తే, మీకు రింగ్వార్మ్, గజ్జి లేదా దురద తదితర సమస్యలు తలెత్తవచ్చు.కాగా సహజ దారాలకు వాటి రంగు ఉండదు.దీంతో వాటికి అందమైన రంగులు వేస్తారు.అద్దకం, ప్రింటింగ్ వంటి ప్రక్రియలలో వివిధ రకాల రసాయనాలు ఫాబ్రిక్‌కు అంటుకుంటాయి.ఫాబ్రిక్ ఎంత రంగురంగులమయంగా, ప్రకాశవంతంగా ఉంటే దానిలో అన్ని ఎక్కువ రంగులను కలుపుతారు.రంగులు తీవ్రమైన చర్మ సమస్యలను తీసుకొస్తాయి, ఇది అలెర్జీలకు దారితీస్తుంది.
అందుకే కొత్త బట్టలను ధరించేముందు వాటిని తప్పనిసరిగా ఉతకాలని గుర్తుంచుకోండి.







