ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):
సూర్యోదయం: ఉదయం 06.32
సూర్యాస్తమయం: సాయంత్రం 05.35
రాహుకాలం: మ.3.00 నుంచి 04.30 వరకు
అమృత ఘడియలు: ఉ.04.30 నుంచి 05.30 వరకు
దుర్ముహూర్తం: ఉ.08.32 నుంచి 11.15 వరకు
ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):
మేషం:

ఈరోజు మీకు అనుకోకుండా ఇతరుల నుండి ధన సహాయం కలుగుతుంది.బయట కొన్ని నూతన పరిచయాలు ఏర్పడతాయి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి.కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.
వృషభం:

ఈరోజు మీకు ఆర్థికంగా అనుకూలంగా ఉంది.ఇతరుల నుండి మీ సొమ్ము తిరిగి వస్తుంది.ఆరోగ్యపరమైన విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి.
కొన్ని దూరపు ప్రయాణాలను వాయిదా వేసుకోవడమే మంచిది.లేదంటే కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.
మిథునం:

ఈరోజు ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.దూర ప్రయాణాలు చేయడం వలన ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి.అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకండి.విద్యార్థులు చదువు పట్ల శ్రద్ధ వహించాలి.మీరు చేసే ఉద్యోగంలో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.
కర్కాటకం:

ఈరోజు మీరు ఆర్థికపరంగా పొదుపు చేయాల్సి ఉంటుంది.అనారోగ్య సమస్యతో బాధపడుతున్న వారికి ఆరోగ్యం కుదుటపడుతుంది.కుటుంబంలో చిన్నపాటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది.కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది.
సింహం:

ఈరోజు మీరు కొన్ని ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు.పెద్దవాళ్లతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి.వ్యాపారస్తులకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.ధైర్యంతో ముందుకు వెళ్తే అంతా మంచే జరుగుతుంది.
కన్య:

ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.పిల్లల భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచనలు చేస్తారు.మీరు చేసే ఉద్యోగంలో గత కొంతకాలం నుండి తీరికలేని సమయంతో గడుపుతారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయాల్లో విజయం ఉంటుంది.
తులా:

ఈరోజు మీరు ఇతరులకు మీ సొమ్ము అప్పుగా ఇచ్చే ముందు ఆలోచించండి.అనవసరంగా ఇరుగు పొరుగు వారితో వాదనలకు దిగే అవకాశం ఉంది.తరచూ మార్చుకునే మీ నిర్ణయాల వలన కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు.
వృశ్చికం:

ఈరోజు మీరు కొన్ని దూరపు ప్రయాణాలు చేస్తారు.వ్యాపారస్తులు ముఖ్యమైన విషయాల గురించి తల్లిదండ్రులతో చర్చలు చేస్తారు.బయట అప్పుగా ఇచ్చిన డబ్బు ఇచ్చినట్టుగా తిరిగి మీ చేతికి అందుతుంది.మీ చిన్ననాటి స్నేహితులు ఈరోజు మిమ్మల్ని కలుస్తారు.
ధనస్సు:

ఈరోజు మీరు దూర ప్రాంతాల నుండి ఒక శుభవార్త వింటారు.అది మీ మనసుకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది.మీరు పని చేసే చోట ఇతరల నుండి ప్రశంసలు అందుతాయి.కొన్ని కొత్త పనులు ప్రారంభించే ముందు ఆలోచనలు ఎంతో అవసరం.
మకరం:

ఈరోజు మీరు అనవసరమైన వస్తువులను కొనుగోలు చేస్తారు.మీ విలువైన సమయాన్ని వృధా చేయకండి.మీరు పని చేసే చోట అలసట ఎక్కువగా ఉంటుంది.ఆదాయానికి మించిన ఖర్చులు ఎక్కువగా ఉంటాయి.దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.
కుంభం:

ఈరోజు మీరు వాహనం కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి.నూతన పరిచయాలు ఏర్పడతాయి.వ్యవసాయదారులు పెట్టుబడి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి.
ప్రారంభించే పనుల్లో మీ తొందరపాటు నిర్ణయాలు పనికిరావు.అనుభవం ఉన్న వ్యక్తులతో చర్చలు చేయాలి.
మీనం:

ఈరోజు మీరు పని చేసే చోట ఇతరుల సహాయం అందుతుంది.ఇతరులతో జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడాలి.కొన్ని ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు.కుటుంబంలో మీకున్న బాధ్యతలను విజయవంతంగా పూర్తి చేస్తారు.చాలా సంతోషంగా ఉంటారు.