దుర్గాష్టమి మహార్నవమి రోజులలో ఇలా.. చేసి ఉంటే అదృష్టమే అదృష్టం..!

నవరాత్రులు దేశవ్యాప్తంగా ఎంతో ఘనంగా, వైభవంగా జరిగాయి.దుర్గాష్టమి( Durga Ashtami ), మహర్నవమి రోజుల్లో కొన్ని ముఖ్యమైన పనులు చేస్తే అదృష్ట లక్ష్మి మీ తలుపు తడుతుందని పురాణాలలో ఉంది.

 If You Do This On Durga Ashtami Maharnavami Days, You Will Be Lucky, Durga Asht-TeluguStop.com

అది శక్తి దుర్గాదేవికి సంబంధించిన శార దియా నవరాత్రులు ముగిసిపోయాయి.నవరాత్రులు అక్టోబర్ 15 మొదలయ్యాయి.

అలాగే అక్టోబర్ 24వ తేదీన విజయదశమి అంటే దసరా పండుగను మన దేశవ్యాప్తంగా ఎంతో ఘనంగా జరుపుకుంటారు.నవరాత్రి పండుగలు అష్టమి, నవమి తిధులు చాలా ముఖ్యమైనవి.

ఈ రెండు తిధులలో కొన్ని పరిహారాలు చేయడం వల్ల దుర్గామాత అనుగ్రహంతో జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు.

Telugu Bhakti, Devotional, Durga Ashtami, Durga Devi, Lakshmi Devi, Maha Navami

నవరాత్రి ( Navaratri )నవమి తిధి రోజు అమ్మవారిని పూజించడం వల్ల పుణ్యఫలం లభిస్తుందని నమ్మేవారు ఎంతో మంది ఉన్నారు.ఈ పూజ వల్ల దుర్గామాత అనుగ్రహంతో భక్తులకు సుఖసంతోషాలు లభిస్తాయని చెబుతున్నారు.సీతాదేవి అశోకవనంలో ఉన్నప్పుడు దసరా నవరాత్రుల సమయంలో అమ్మవారిని అర్చించిందని అప్పుడే శ్రీరామచంద్రుడు రావణాసురుడిని అంతమొందించాడని దేవీ భాగవతంలో ఉంది.

అష్టమి, నవమి రోజున మీ శక్తి మేరకు పేదలకు దానధర్మాలు చేయాలి.ఈ రెండు తిధులలో మీరు అవసరమైన వారికి ఆహార ధాన్యాలు, దుస్తులు, డబ్బును దానంగా ఇవ్వవచ్చు.

ఇలా దానధర్మాలు చేయడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం పొందవచ్చు.నవరాత్రి ఉత్సవాలలో చివరి రోజు అంటే నవమి రోజు కుంకుమ, గాజులు, కాటుక లాంటి వస్తువులను దానం చేయడం మంచిది.

Telugu Bhakti, Devotional, Durga Ashtami, Durga Devi, Lakshmi Devi, Maha Navami

నవరాత్రులలో అష్టమి నవమి తిథిలలో దుర్గా మాతకు నీరు సమర్పించడం వల్ల ఐశ్వర్యం కలుగుతుందని చాలామంది భక్తులు నమ్ముతారు.ఈ రోజున అత్తరు కలిపినా సువాసన గల నీటితో దుర్గాదేవికి జలాభిషేకం చేయాలి.నవరాత్రులలో అష్టమి తిథిలలో దుర్గా సప్తశతి భక్తి ప్రపత్తులతో చదవాలి.ఇలా పరాయణం చేయడం వల్ల దుర్గాదేవి( Durga Devi ) భక్తులను అనుగ్రహిస్తుంది.అష్టమి, నవమి రోజున ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఆవు నెయ్యి దీపం వెలిగించాలి.ఇలా చేయడం వలన అమ్మవారి అనుగ్రహం లభించి ఇంట్లోనీ అరిష్టం దూరమైపోతాయని పండితులు చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube