దేశవ్యాప్తంగా కొద్ది నెలలలో ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.ఈసారి జరగబోయే ఎన్నికలలో గెలవాలని కాంగ్రెస్ “ఇండియా”( India ) అనే పేరుతో కూటమిని ఏర్పాటు చేయడం జరిగింది.
అయితే ఈ కూటమిలో తొలుత దేశవ్యాప్తంగా బలమైన పార్టీలు జాయిన్ అయ్యాయి.కానీ సీట్ల కేటాయింపు విషయంలో మరికొన్ని విషయాలలో అభ్యంతరాలు రావడంతో మెల్లమెల్లగా… కూటమి నుండి దూరమవుతున్నాయి.
గత రెండు దఫా ఎన్నికలతో పోలిస్తే ఈసారి ఎన్నికలకు కాంగ్రెస్ కొద్దిగా బలపడిందని చెప్పవచ్చు.దీనికి ప్రధాన కారణం రాహుల్ గాంధీ( Rahul Gandhi ) భారత్ జోడో యాత్ర, భారత్ జోడో న్యాయ్ యాత్ర.
ఈ రెండు కార్యక్రమాలు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి మంచి మైలేజ్ తీసుకురావడం జరిగాయి.
ఇదిలా ఉంటే పార్టీ అగ్రనేత సోనియాగాంధీ( Sonia Gandhi ) విషయంలో కాంగ్రెస్ అధిష్టానం సంచలన నిర్ణయం తీసుకుంది.ప్రత్యక్ష ఎన్నికలకు ఆమెను దూరంగా పెట్టి రాజ్యసభకు నామినేట్ చేయడానికి డిసైడ్ కావడం జరిగింది.దీంతో రెండు దశాబ్దాలుగా రాయ్ బరేలి నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న సోనియాను ఈసారి నేరుగా రాజ్యసభకు నామినేట్ చేయబోతున్నారు.
రేపు రాజస్థాన్ నుంచి రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేయనున్నారు.ఇదే సమయంలో త్వరలో జరగబోయే ఎన్నికలలో రాయ్ బరేలి నుండి ప్రియాంక గాంధీ పోటీ చేయనున్నారు.ఏదిఏమైన ఈసారి ఎన్నికలలో కాంగ్రెస్ గతంలో కంటే ఎక్కువ సీట్లు సాధించే దిశగా అడుగులు వేస్తోంది.