సాధారణ బ్రెడ్ కంటే బ్రౌన్ బ్రెడ్ ఎందుకు మంచిది.. దీనివల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

చాలా మంది ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో బ్రెడ్ ను తింటూ ఉంటారు.ముఖ్యంగా బిజీ లైఫ్ స్టైల్ ఉన్నవారు ఫుడ్ వండుకునేంత సమయం లేక రెండు బ్రెడ్ ముక్కలు తీసుకుని సాస్ లేదా బటర్ రాసి తినేస్తుంటారు.

 Why Brown Bread Is Better Than White Bread?, Brown Bread, Brown Bread Health Ben-TeluguStop.com

అయితే ఆరోగ్య నిపుణులు సాధారణ బ్రెడ్ కు బదులుగా బ్రౌన్ బ్రెడ్ ను తీసుకోమని చెబుతుంటారు.అసలు వైట్ బ్రెడ్ కంటే బ్రౌన్ బ్రెడ్‌ ఎందుకు మంచిది.? బ్రౌన్ బెడ్( Brown Bread ) వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి.? వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Telugu Brown Bread, Brownbread, Tips, Latest, White Bread, Whitebread-Latest New

వైట్ బ్రెడ్( White Bread ) ను మైదాతో తయారు చేస్తారు.బ్రౌన్ బ్రెడ్ ను మల్టీ గ్రెయిన్ తో తయారు చేస్తారు.వైట్ బ్రెడ్ లో కార్బోహైడ్రేట్స్ తప్పితే పోషకాలు ఏమీ ఉండవు.వైట్ బ్రెడ్ ను తీసుకోవడం వల్ల షుగర్ లెవెల్స్ పెరుగుతాయి.వెయిట్ గెయిన్ అవుతారు.ఇలా ఎన్నో సమస్యలు వస్తాయి.

కానీ బ్రౌన్ బ్రెడ్ లో ఫైబర్, ప్రోటీన్, విటమిన్స్, మినరల్స్, ఫ్యాటీ ఆసిడ్స్ వంటి పోషకాలు నిండి ఉంటాయి.బ్రౌన్ బ్రెడ్ ను తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మేలే కానీ హాని ఉండదు.

సాధారణ బ్రెడ్ కు బదులుగా బ్రౌన్ బ్రెడ్ ను తీసుకోవడం వల్ల గుండె జబ్బులు వచ్చే రిస్క్ తగ్గుతుంది.బ్లడ్ షుగర్ లెవెల్స్( Blood Sugar Levels ) లో హెచ్చుతగ్గులు ఏర్పడకుండా ఉంటాయి.

వెయిట్ లాస్ అవ్వాలని ప్రయత్నిస్తున్న వారికి బ్రౌన్ బ్రెడ్ బెస్ట్ ఆప్షన్.బ్రౌన్ బ్రెడ్ ను తీసుకోవడం వల్ల ఎక్కువ సమయం పాటు కడుపు నిండుగా ఉన్న భావన కలుగుతుంది.

అతి ఆకలి దూరం అవుతుంది.చిరు తిండ్ల‌పై మనసు మళ్లకుండా ఉంటుంది.

ఫలితంగా వెయిట్ లాస్ అవుతారు.

Telugu Brown Bread, Brownbread, Tips, Latest, White Bread, Whitebread-Latest New

అలాగే రోజుకు రెండు బ్రౌన్ బ్రెడ్ ముక్క‌లు తింటే మన బాడీలో సెరోటోనిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది.ఇది ఒక హ్యాపీ హార్మోన్. దీనివల్ల ఒత్తిడి, డిప్రెషన్ వంటి మానసిక సమస్యలు దూరం అవుతాయి.

అంతేకాదు బ్రౌన్ బ్రెడ్ లో ఉండే ఫైబర్ మన జీర్ణ వ్యవస్థ పనితీరును చురుగ్గా మారుస్తుంది.బ్రౌన్ బ్రెడ్ లో ఉండే యాంటీ ఆక్సిడెండ్స్‌ ఫ్రీ రాడికల్స్ నుంచి కణాలను రక్షించడానికి తోడ్పడతాయి.

మరియు క్యాన్సర్( Cancer ) వచ్చే రిస్క్ ను సైతం తగ్గిస్తాయి.అయితే ఇన్ని లాభాలు ఉన్నాయి కదా అని అధికంగా బ్రౌన్‌ బ్రెడ్ ను తీసుకుంటే డేంజర్ లో పడతారు జాగ్రత్త.

ఆరోగ్యానికి ఎంత మంచిదైనా సరే లిమిట్ గా తీసుకుంటేనే దాని ప్రయోజనాలు పొందుతారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube