జాబిల్లిపైకి మనుషులను తీసుకెళ్లడానికి ఇండియాకి 30 ఏళ్లు పట్టొచ్చు!

చందమామపై చంద్రయాన్-3( Chandrayaan-3 ) సాఫ్ట్ లాండింగ్ సక్సెస్ అయ్యాక చాలామంది సంతోషించారు.చంద్రుడిపై మనుషులను ఇస్రో( ISRO ) ఎప్పుడు తీసుకెళ్తుంది అంటూ ప్రశ్నలు కూడా అడగటం స్టార్ట్ చేశారు.

 It May Take 30 Years For India To Take Humans To Moon Details, India, Indian Man-TeluguStop.com

అయితే జాబిల్లిపై మనుషులను తీసుకెళ్లడానికి ఇండియాకి మరొక 20 నుంచి 30 ఏళ్ల సమయం పట్టొచ్చని తెలుస్తోంది.అహ్మదాబాద్ సిటీలోని ఇండియాకు చెందిన స్పేస్ అప్లికేషన్ సెంటర్ డైరెక్టర్ నీలేష్ దేశాయ్( Nilesh Desai ) మాట్లాడుతూ చంద్రునిపైకి మానవులతో కూడిన మిషన్లను పంపడానికి భారతదేశానికి కనీసం 20-30 సంవత్సరాలు పట్టవచ్చని అన్నారు.

Telugu Aditya, Chandrayaan, Humans Moon, India, Indian, Isro, Latest, Moon, Sulp

మనుషులతో కూడిన మిషన్‌ను పంపే ముందు భారతదేశం( India ) తన టెక్నాలజీని అప్‌గ్రేడ్ చేయాలని చెప్పారు.అలానే బాగా టెస్ట్ చేసిన టెక్నాలజీలను అభివృద్ధి చేయాల్సి ఉంటుందని ఆయన అన్నారు.కొనసాగుతున్న చంద్రయాన్-3 మిషన్ గురించి, చంద్రుని దక్షిణ ధ్రువ ప్రాంతం( South Pole ) నుంచి విక్రమ్ ల్యాండర్, రోవర్ పంపిన డేటా గురించి కూడా దేశాయ్ మాట్లాడారు.చంద్రుడి ఉపరితలంపై ఇతర దేశాలు చేసిన ప్రయోగాల్లో కనిపించని సల్ఫర్‌ ఉనికిని లేజర్‌ ఎల్‌ఐబీఎస్‌ స్పెక్ట్రోగ్రామ్‌ ద్వారా తేలిందని తెలిపారు.

Telugu Aditya, Chandrayaan, Humans Moon, India, Indian, Isro, Latest, Moon, Sulp

భవిష్యత్‌లో చంద్రునిపై( Moon ) జీవం నిలవగలదో లేదో తెలుసుకోవడానికి భారత్ ప్రయత్నిస్తోందని ఆయన అన్నారు.చంద్రయాన్-1 మిషన్ చంద్రునిపై హైడ్రాక్సిల్ అణువులను కనుగొందని, దక్షిణ ధ్రువ ప్రాంతంలోని క్రేటర్స్ అంచుపై గడ్డకట్టిన మంచు ఉందా లేదా అని తెలుసుకోవడానికి చంద్రయాన్-3 మిషన్ ప్రయత్నిస్తోందని ఆయన చెప్పారు.సూర్యుడిని అధ్యయనం చేసేందుకు ఆదిత్య ఎల్1 మిషన్( Aditya L-1 ) శాస్త్రవేత్తలకు సహాయపడుతుందని పేర్కొన్నారు.ఆదిత్య L1 మిషన్‌ సూర్యుని మంటలు, సూర్యుని మచ్చలు, సూర్య తుఫానులు తదితర అంశాలను వివరంగా అధ్యయనం చేయడానికి భారతదేశాన్ని అనుమతిస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube