ఆమ్లా.( Amla ) మన భాషలో చెప్పాలంటే ఉసిరికాయలు. ఇంగ్లీషులో ఇండియన్ గూస్బెర్రీ అని అంటాము.ప్రస్తుత సీజన్ లో మనకు ఉసిరికాయలు చాలా విరివిగా లభ్యమవుతుంటాయి.ధర గురించి పక్కన పెడితే.ఉసిరికాయల్లో పోషకాలు మాత్రం అధికం.
విటమిన్ సి, కాల్షియం, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, ఫాస్పరస్, శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్, ఫైబర్, ఆరోగ్యకరమైన ఫ్యాట్స్, ప్రోటీన్.ఇలా ఎన్నో పోషక విలువలు మనం ఉసిరికాయ ద్వారా పొందవచ్చు.
అందుకే ఉసిరికాయలను ఆహారంలో భాగం చేసుకోవాలని నిపుణులు చెబుతుంటారు.
ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోయే ఆమ్లా జ్యూస్( Amla Juice ) వారానికి రెండు సార్లు తీసుకుంటే బోలెడు ఆరోగ్య లాభాలు పొందుతారు.జ్యూస్ తయారీ కోసం బ్లెండర్ తీసుకుని అందులో మూడు గింజ తొలగించి సన్నగా తరిగిన ఉసిరికాయలను వేసుకోవాలి.అలాగే పది ఫ్రెష్ పుదీనా ఆకులు,( Mint Leaves ) వన్ టీ స్పూన్ అల్లం ముక్కలు,( Ginger ) పావు టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, చిటికెడు మిరియాల పొడి, వన్ టేబుల్ స్పూన్ తేనె మరియు ఒక గ్లాస్ వాటర్ వేసుకుని నాలుగు నిమిషాల పాటు బ్లెండ్ చేస్తే మన ఆమ్లా జ్యూస్ అనేది రెడీ అవుతుంది.
ఈ జ్యూస్ ను వారంలో కనీసం రెండు సార్లు కనుక తీసుకున్నారంటే అందులో అధిక మొత్తంలో ఉండే విటమిన్ సి మన శరీర రోగ అనిరోధక శక్తిని బలపరచడంలో సహాయపడుతుంది.ఆమ్లా జ్యూస్ తాగడం వల్ల శక్తి స్థాయిలు పెరుగుతాయి.నరాల బలం మెరుగుపడుతుంది.ఈ ఆమ్లా జ్యూస్ కి రక్తాన్ని శుభ్రం చేసే గుణాలు ఉన్నాయి.అదే సమయంలో శరీరంలోని టాక్సిన్లను బయటకు తీసేస్తుంది.
ఆమ్లా జ్యూస్ ను డైట్ లో చేర్చుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ బలపడుతుంది.
అజీర్తి, గ్యాస్, కడుపు గందరగోళాలను తగ్గిస్తుంది.ఆమ్లా జ్యూస్ చర్మానికి కొత్త మెరుపును జోడిస్తుంది.
మొటిమలు, మచ్చలు తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది.మధుమేహం ఉన్నవారు ఆమ్లా జ్యూస్ ను తీసుకుంటే షుగర్ లెవల్స్ ను నియంత్రిస్తుంది.
అంతేకాదండోయ్.ఆమ్లా జ్యూస్ ను తరచూ తాగడం కంటిచూపు మెరుగుపడుతుంది.
జుట్టు రాలడం తగ్గి ఒత్తుగా సైతం పెరుగుతుంది.