సైనస్.చాలా మందిని వేధిస్తున్న సమస్య ఇది.సైనస్ సమస్య ఉన్న వారు జలుబు, తరచూ ముక్కు కారడం, తలనొప్పి, తుమ్ములు, దగ్గు, ముక్కులో నొప్పి, గొంతు నొప్పి, ముఖంలో వాపు, అలసట, తల బరువుగా ఉండటం ఇలా చాలా సమస్యలు ఎదురవుతాయి.ఒక్కసారి సైనస్ వచ్చిందంటే.
వారి బాధ వర్ణనాతీతం అని చెప్పాలి.అందులోనూ ఈ చలి కాలంలో అయితే బాధ మరింత తీవ్రంగా ఉంటుంది.
మారిన జీవణశైలి, వాతావరణం మార్పులు, వాటర్ చేంజ్ ఇలా రకరకాల కారణాల వల్ల సైనస్ బారిన పడుతుంటారు.ఇక సైనస్‌కు మందులు ఉన్నప్పటికీ.
అవి శాశ్వత పరిష్కరాన్ని అందించలేవు.
అయితే న్యాచురల్‌గా కొన్ని టిప్స్ పాటించి.
సైనస్ సమస్యను నివారించుకోవచ్చు.మరి ఆ టిప్స్ ఏంటీ అన్నది ఆలస్యం చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.
సైనస్ ఉన్న వారు చల్లటి ఆహారాలకు ద్రవాలకు దూరంగా ఉండాలి.అలాగే ప్రతి రోజు వేడి నీటి స్నానమే చేయాలి.
అలాగే హాట్ వాటర్‌లో యూకలిప్టస్ ఆయిల్ వేసి.ఆవిరి పట్టాలి.
రోజుకు రెండు సార్లు ఆవిరి పట్టడం ద్వారా సైనస్ సమస్య నుంచి మంచి ఉపశమనాన్ని అందిస్తుంది.
జీలకర్ర మరియు తేనె కాంబినేషన్ కూడా సైనస్ సమస్యను నివారిస్తుంది.ముందుగా జీలకర్రను లైట్ గా డ్రై రోస్ట్ చేసుకుని.పొడి చేసుకోవాలి.
ఆ పొడిలో కొద్దిగా తేనె మిక్స్ చేసి తీసుకోవాలి.ఇలా ప్రతి రోజు చేయడం వల్ల సైనస్ సమస్య క్రమంగా తగ్గిపోతుంది.
అలాగే సైనస్‌తో బాధ పడేవారు స్పైసీ స్పైసీగా ఉండే ఫుడ్‌ను తీసుకోవాలి.ఎందుకంటే, స్పైసీ ఫుడ్‌లో ఉండే యాంటీ ఇన్‌ఫ్లామేటరీ, యాంటీ బాక్టీరియల్ గుణాలు.
సైనస్‌కు ప్రధాన కారణమయ్యే బ్యాక్టీరియా, ఫంగల్ ఇన్‌ఫెక్షన్లను నాశనం చేస్తాయి.
సైనస్ సమస్య ఉన్న వారు రెగ్యులర్‌గా ఎక్కువ వాటర్‌ను సేవించాలి.దాంతో శరీరం ఎప్పుడూ హైడ్రేటెడ్‌గా ఉంటుంది.సైనస్ దూరం అవుతుంది.
అలాగే గ్రేప్ ఫ్రూట్ ఎక్స్ ట్రాక్ట్ సైనస్‌ను నివారించడంలో ఎఫెక్టివ్‌గా పని చేస్తుంది.ఈ గ్రేప్ ఫ్రూట్ ఎక్స్ ట్రాక్ట్ తో టీ చేసుకుని ప్రతి రోజు సేవిస్తే.
సైనస్ సమస్య నుంచి మంచి ఉపశమనం లభిస్తుంది.