నాజూకైన నడుము కావాలని కోరుకోని అమ్మాయిలు ఉండరు.నడుము సన్నగా మల్లెతీగలా ఉంటే ఎలాంటి డ్రస్సులైనా సూటవుతాయని చాలామంది భావిస్తారు.
అందుకే నాజూకైన నడుము కోసం ఆరాటపడుతుంటారు.కానీ, ఆహారపు అలవాట్లు, జీవన శైలిలో మార్పులు, గంటలు తరబడి ఒకే చోట కూర్చుని ఉండటం, మద్యపానం, ధూమపానం, ఒత్తిడి, నిద్రను నిర్లక్ష్యం చేయడం వంటి రకరకాల కారణాల వల్ల నడుము చుట్టూ కొవ్వు పేరుకుపోయి లావుగా తయారవుతుంటుంది.
దాంతో నడుమును మళ్లీ సన్నగా మార్చుకోవడం కోసం చాలా రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.ఈ జాబితాలో మీరు ఉన్నారా.? అయితే మీకు ఇప్పుడు చెప్పబోయే ఫ్యాట్ కట్టర్ డ్రింక్ అద్భుతంగా సహాయపడుతుంది.ఈ డ్రింక్‌ను రోజుకు ఒక కప్పు చప్పున తీసుకుంటే మీ నడుము నాజూగ్గా మారుతుంది.
మరి ఇంకెందుకు ఆలస్యం ఆ ఫ్యాట్ కట్టర్ డ్రింక్‌ను ఎలా తయారు చేసుకోవాలి.? ఎప్పుడు తీసుకోవాలి.? వంటి విషయాలపై ఓ లుక్కేసేయండి.ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని ఒక గ్లాస్ వాటర్ పోయాలి.
వాటర్ హీట్ అవ్వగానే అందులో పావు స్పూన్ మిరియాల పొడి, హాఫ్ టేబుల్ స్పూన్ సోంపు పొడి, దంచిన అల్లం ముక్క చిన్నది, చిటికెడు నల్ల ఉప్పు, చిటికెడు జాజికాయ పొడి వేసి రెండు నిమిషాల పాటు మరిగించాలి.ఆ తర్వాత అందులో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, ఒకటిన్నర స్పూన్ బెల్లం తురుము వేసుకుని ఐదు నిమిషాల పాటు మరిగించాలి.

ఆపై స్టవ్ ఆఫ్ చేసుకుని.వాటర్‌ను ఫిల్టర్ చేసుకుంటే ఫ్యాట్ కట్టర్ డ్రింక్ సిద్ధమైనట్లే.ఈ డ్రింక్ ను బ్రేక్ ఫాస్ట్ లేదా లంచ్ లేదా డిన్నర్ కు గంట ముందు తీసుకోవాలి.రోజుకు ఒక కప్పు చప్పున ఈ ఫ్యాట్ కట్టర్ డ్రింక్ ను తీసుకుంటే కొవ్వు కరిగి నడుము నాజూగ్గా మారుతుంది.
బరువు కూడా తగ్గుతారు.