జుట్టు స్ట్రాంగ్ గా ఉండాలని, షైనీ గా మెరిసిపోతూ కనిపించాలని చాలా మంది కోరుకుంటారు.కురులు స్ట్రాంగ్ గా ఉండడం వల్ల హెయిర్ ఫాల్, హెయిర్ బ్రేకేజ్ సమస్యలు తగ్గుతాయి.
అందుకే జుట్టును బలోపేతం చేసుకునేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు.అయితే అందుకు మన వంటింట్లో ఉండే బియ్యం పిండి( rice flour ) చాలా అద్భుతంగా తోడ్పడుతుంది.
రెండు స్పూన్ల బియ్యం పిండితో ఇప్పుడు చెప్పబోయే విధంగా చేశారంటే స్ట్రాంగ్ అండ్ షైనీ హెయిర్ మీ సొంతం అవ్వడం ఖాయం.
అందుకోసం ముందుగా ఒక కలబంద ఆకుని తీసుకుని వాటర్ తో శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి.వాటర్ హీట్ అయ్యాక రెండు టేబుల్ స్పూన్లు బియ్యం పిండిని వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి.
అలాగే అందులో కట్ చేసి పెట్టుకున్న అలోవెరా( Aloe vera ) కూడా వేసి పది నుంచి పన్నెండు నిమిషాల పాటు ఉడికించాలి.
ఆపై స్టవ్ ఆఫ్ చేసుకుని స్ట్రైనర్ సహాయంతో ఉడికించిన మిశ్రమాన్ని పల్చటి క్లాత్ లో వేసి స్ట్రైన్ చేసుకోవాలి.ఈ విధంగా స్ట్రైన్ చేసుకున్న మిశ్రమంలో రెండు టేబుల్ స్పూన్లు ఆవ నూనె( Mustard oil ) వేసి కలిపి జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించాలి.గంట పాటు షవర్ క్యాప్ ధరించిన అనంతరం మైల్డ్ షాంపూను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.
వారానికి ఒకసారి ఈ విధంగా కనుక చేస్తే జుట్టు మూలాల నుంచి స్ట్రాంగ్ గా మారుతుంది.జుట్టు రాలడం, విరగడం వంటి సమస్యలు తగ్గు ముఖం పడతాయి.కురులు స్మూత్ గా సిల్కీగా మారుతాయి.షైనీ గా మెరుస్తాయి.డ్రై హెయిర్ ను రిపేర్ చేయడంలో కూడా ఈ రెమెడీ ఎంతో ఉత్తమం గా సహాయపడుతుంది.కాబట్టి తప్పకుండా ప్రయత్నించండి.
మంచి రిజల్ట్ మీ సొంతం అవుతుంది.