డెంగ్యూ జ్వరానికి వేపాకుల వైద్యం...

డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు వర్షాలతో పాటు వచ్చేస్తాయి.డెంగ్యూ జ్వరం వల్ల శరీరంలో ప్లేట్‌లెట్ కౌంట్ వేగంగా తగ్గిపోతుంది.

 Neems Treatment For Dengue Fever  Dengue, Malaria, Immunity ,  Papaya Leaves, An-TeluguStop.com

బొప్పాయి ఆకుల నుండి రసాలను తీసుకోవడం వల్ల ప్లేట్‌లెట్ కౌంట్‌ తగ్గకుండా మెయింటైన్ చేయడంతోపాటు రోగనిరోధక శక్తిని పెంచవచ్చు.బొప్పాయి ఆకులకు యాంటీ ఆక్సిడెంట్ గుణాలు కూడా ఉన్నాయి.

అదేవిధంగా ప్లేట్‌లెట్ కౌంట్‌ను పెంచడానికి వేప ఆకులు కూడా ప్రయోజనకరంగా ఉంటాయి.శరీరంలోని ఇన్ఫెక్షన్‌ను ఎదుర్కోవడంలో తెల్ల రక్త కణాలను పెంచడానికి కూడా ఇవి సహాయపడతాయి.

యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ల్పమేటరీ లక్షణాలు ఉన్నాయి.మెంతి గింజలు బహుళ పోషకాలతో సమృద్ధిగా ఉంటాయి.

అధిక శరీర ఉష్ణోగ్రతను అదుపుచేయడంతో పాటు కండరాల నొప్పిని తగ్గించడంలో కూడా ఇవి చాలా సాయపడతాయి.ఇవి శరీరానికి విశ్రాంతిని కలిగించి అవసరమైన నిద్రను పొందడంలో సహాయపడుతాయి.

పసుపు కూడా యాంటిమైక్రోబయల్, యాంటిసెప్టిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ.ఇది చాలా సహాయకారిగా ఉంటుంది.రోగనిరోధక వ్యవస్థను మెరుగు పరుస్తోంది.ఇది జీవక్రియను కూడా పెంచుతుంది.తులసి ఆకులు ఒక అద్భుత ఔషధంగా పనిచేస్తాయి.రోగనిరోధక శక్తిని పెంచడానికి తులసి, నల్ల మిరియాలు కలిపి తీసుకోవడం మంచిదని నిపుణులు చెపుతారు.

ఈ రెండింటిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.అలాగే తులసి, ఎండుమిర్చిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

దోమల నివారణ గుణాలు కలిగిన మొక్కలను పెంచడం ద్వారా వాటిని అడ్డుకోవచ్చు.

కొన్ని మొక్కలు దోమలను తరిమికొట్టే సహజ గుణం కలిగి ఉంటాయి.ఈ మొక్కల సారాలను తరచుగా దోమలను తిప్పికొట్టే క్రీములలో కూడా చూడవచ్చు.అలాంటి మొక్కలను ఇంట్లో పెంచి సంరక్షించుకోవచ్చు.

ఇది అందంగా కనిపించడమే కాకుండా, దోమలను అతి తక్కువ శ్రమతో, సహజమైన రీతిలో దూరంగా ఉంచడంలో సహాయపడుతాయి.లెమన్ గ్రాస్, తులసి వంటి కొన్ని మొక్కలు ఉన్నాయి.

అలాగే వేప, యూకలిప్టస్ వంటి కొన్ని పెద్ద మొక్కలతో కూడా దోమలను నిరోధించవచ్చు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube